కాంగ్రెస్ కండువా కప్పుకొన్న మైనంపల్లి, వేముల వీరేశం
న్యూఢిల్లీ: తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు పూర్తి చేస్తోంది.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడంలో తలమునకలైంది ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో వరుస భేటీలు ఏర్పాటవుతున్నాయి.

అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ బూస్ట్ లభించింది. ఊహించినట్టే- భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నేత, మల్కాజ్‌గిరి శాసన సభ్యుడు మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమారుడు రోహిత్‌తో కలిసి కొద్దిసేపటి కిందటే ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు.
వారి సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి.. మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలోనూ ఆయన పేరు ఉంది.

అదే సమయంలో ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావుతో నెలకొన్న విభేదాల కారణంగా బీఆర్ఎస్ నుంచి బయటికి రావాల్సి వచ్చిందాయనకు. కొద్దిరోజుల కిందటే బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. తాజాగా కుమారుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకుని రావడం, హరీష్ రావును మట్టికరిపించడమే తన లక్ష్యమని వ్యాఖ్యానించారాయన.
అదే సమయంలో- బీఆర్ఎస్‌కే చెందిన మరో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా కాంగ్రెస్‌లో చేరారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహించారు. 2018 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. వీరేశం స్థానంలో చిరుమర్తి లింగయ్య ఇక్కడి నుంచి విజయం సాధించారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications