తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై సవాల్
Revanth Reddy: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి నాయకుల మధ్య వాడివేడిగా వాగ్వివాదం కొనసాగుతోంది. సవాళ్లు- ప్రతి సవాళ్లు విసురుకుంటోన్నారు. ఆరోపణలు- ప్రత్యారోపణలను రాజకీయ వాతావరణం వేడెక్కింది.
రైతు భరోసా నిధుల విడుదలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మందికి రైతు భరోసా కింద నిధులను విడుదల చేశానంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను బీఆర్ఎస్ నాయకులు తప్పుపడుతున్నారు. ఆయనపై విమర్శల దాడికి దిగుతున్నారు.

65 లక్షలమందికి కాదు కదా.. ఒక్కరికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కింద నిధులను విడుదల చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. ఒక్కరికైనా సరే ఈ నిధులను విడుదల చేసి ఉంటే తాను ముక్కు నేలకు రాస్తానని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి కొనసాగించింది.. తమ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకాన్ని మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఆమోదించిన 4,700 కోట్ల రూపాయల నిధులను.. అధికారంలోకి వచ్చినప్పుడే విడుదల చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అయిదు నెలల పాటు రైతులను సతాయించారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ హయాంలో క్లియర్ చేసిన రైతు బంధు నిధులను లోక్‌సభ ఎన్నికల వరకు విడుదల చేయకుండా అయిదు నెలల పాటు అడ్డుకున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినందున 65 లక్షల మందికి ఇచ్చానని గొప్పగా చెప్పుకోవడం కాదని విమర్శించారు.
ఇన్ని నెలల పాటు ఈ నిధులను విడుదల చేయకుండా అడ్డుపడినందుకు ముక్కు నేలకు రాయలని రేవంత్ రెడ్డికి ఆయన డిమాండ్ చేశారు. నిధుల విడుదలలో జాప్యం చోటు చేసుకోవడం వల్ల అనేక మంది రైతులు అధిక వడ్డీకి రుణాలను తెచ్చుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications