TET Exams Fees : టెట్ ఫీజును భారీగా పెంచడం మోసం కాదా.. సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సూటి ప్రశ్న..!
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఫీజులను భారీగా పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. టెట్ ఫీజు పెంచడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం.. విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేయడమేనని మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు.
అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరమన్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హరీశ్ రావు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా ఫీజు రూ.400లు మాత్రమే ఉందన్న హరీశ్ రావు.. ఇప్పుడు టెట్ ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీబీఎస్‌ఈ నిర్వహించే సీ టెట్‌తో పోల్చితే.. టెట్ ఫీజులు రెట్టింపుగా ఉన్నాయని హరీశ్ రావు చెప్పారు. రిజర్వుడ్ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకుండా జనరల్ కేటగిరీ విద్యార్థులతో సమానంగా ఒకే తరహా ఫీజులను అమలు చేయడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని ధ్వజమెత్తారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సీ-టెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు సీబీఎస్‌ఈ ఫీజు రాయితీని అమలు చేస్తున్నారని కానీ, టెట్‌లో మాత్రం తెలంగాణ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెట్ ఫీజుల పెంపు, రిజర్వుడ్ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకపోవడాని నిరసిస్తూ బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పోరాడుతున్నారన్నారు. పుస్తకాలు వదిలి రోడ్లకెక్కి ఉద్యమిస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని హరీశ్ రావు మండిపడ్డారు. ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం?, ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, వెంటనే టెట్ ఫీజులు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున పోరాటం తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు.
భారీగా పెరిగిన టెట్ ఫీజులు
తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచడంపై నిరుద్యోగాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టెట్ దరఖాస్తుకు తెలంగాణ విద్యాశాఖ ఇటీవల రుసుములను భారీగా పెంచిన విషయం తెలిసిందే. గతంలో ఒక పేపర్ రాస్తే రూ.200 రుసుము ఉండగా, దాన్ని రూ.వెయ్యికి పెంచింది. రెండు పేపర్లు రాస్తే గతంలో రూ.300 రుసుము ఉండగా, దాన్ని రూ.2,000కు పెంపుదల చేసింది. ఈ మేరకు టెట్‌కు సంబంధించిన సమాచార పత్రాన్ని శుక్రవారం విడుదల చేసింది. ఇందులో రుసుముల వివరాలు, ఇతర అంశాలను వెల్లడించింది.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రాజకీయ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications