ఈ చీరె, గాజులు వేసుకోని పబ్లిక్‌లో తిరగండి

Padi Kaushik Reddy: ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితికి చెందిన శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు. వారి వ్యవహార శైలిని ఎండగట్టారు.

ఇప్పటివరకు మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి- స్టేషన్ ఘన్‌పూర్, దానం నాగేందర్- ఖైరతాబాద్, తెల్లం వెంకట్రావ్- భద్రాచలం, పోచారం శ్రీనివాసరెడ్డి- బాన్సువాడ, డాక్టర్ ఎం సంజయ్ కుమార్- జగిత్యాల, కాలె యాదయ్య- చేవెళ్ల, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి- గద్వాల, టీ ప్రకాష్ గౌడ్- రాజేంద్రనగర్‌, అరికెపూడి గాంధీ- శేరిలింగంపల్లి, గూడెం మహిపాల్ రెడ్డి- పఠాన్‌చెరు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.

BRS MLA Padi Kaushik Reddy lashes out at Own Party MLA s who joined in Congress

వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ వస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద.. ఈ ఉదయం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కలిశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాము వేసిన పిటిషన్‌పై హైకోర్టు వెలువరించిన తీర్పును వెంటనే అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు.

అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారికి చీరె, గాజులు పంపించారు. చీరె, గాజులు కొనుక్కోని నియోజకవర్గాల్లో పర్యటించాలంటూ హితవు పలికారు. వారికి ఇజ్జత్ లేదంటూ మండిపడ్డారు.

కడియం శ్రీహరిని పచ్చి మోసగాడు, దానం నాగేందర్‌ను బిచ్చగాడిగా అభివర్ణించారు. దానం నాగేందర్ గతంలో అనేక పార్టీలు ఫిరాయించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్- తెలుగుదేశం- కాంగ్రెస్- బీఆర్ఎస్- మళ్లీ కాంగ్రెస్.. ఇలా దానం నాగేందర్ పూటకో పార్టీ మారుతూ వచ్చాడని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌లో దానం నాగేందర్‌ను మించిన ఛీటర్ మరొకరు ఉండరని విమర్శించారు. భవిష్యత్తులో ఆయన మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడని అన్నారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఓటర్లు ఉప ఎన్నికల కోసం ఎదురు చూస్తోన్నారని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆయా స్థానాల్లో ఎన్నికలు జరిగితే వాళ్లకు డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+