తీహార్ జైలుకు హరీష్ రావు: 100 రోజులకు పైగా
K Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను ఈ ఉదయం మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీష్ రావు ములాఖత్ అయ్యారు. ఆమె యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. ఈ ఏడాది మార్చి 15వ తేదీన అయ్యారు. జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసింది.

ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ జులై 3వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది. ఆ తరువాత ఆమెను ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెడతారు ఈడీ అధికారులు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున కస్టడీని మరి కొంతకాలం పొడిగించాలని కోరే అవకాశాలు లేకపోలేదు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని, మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాల్సి ఉందని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరిస్తూ వస్తోన్నారు. ఇప్పటికే కవితకు చెందిన 100 కోట్ల రూపాయలను అటాచ్ చేశారు. ఇదే కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం ఇంకా విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఇన్ని రోజుల పాటు నిర్వహించిన విచారణ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ గానీ, కవిత గానీ తమకు సహకరించట్లేదంటూ అటు ఈడీ అధికారులు కూడా గతంలో పలుమార్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తాము అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలను ఇచ్చారనేది వారి వాదన.
గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవిత నుంచి 25 కోట్ల రూపాయలను వినోద్ చౌహాన్ అందుకున్నట్లు ఈడీ అధికారులు గతంలో న్యాయస్థానానికి వెల్లడించారు. అభిషేక్ బోయిన్‌పల్లి ద్వారా కవిత పీఏ ఈ మొత్తాన్ని హవాలా రాకెట్ రూపంలో బదలాయించినట్లు వివరించారు. మేలోనే వినోద్ చౌహాన్‌ను అరెస్ట్ అయ్యాడు.












Click it and Unblock the Notifications