బీఆర్ఎస్‌కు మళ్లీ మంచిరోజులు: పార్టీని వీడుతున్నవారిపై కేసీఆర్ ఏమన్నారంటే?

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి తమ పార్టీ ప్రజా ప్రతినిధులు ఇతర పార్టీల్లో చేరడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్​ఎస్‌​కు వచ్చే నష్టమేమీ లేదని కేసీఆర్​ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్​ మండలం ఎర్రవల్లిలోని​ ఫాంహౌస్‌​లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కేసీఆర్​‌ను కలిశారు.

ఈ సందర్భంగా వారితో కేసీఆర్​ సమావేశమై బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై చర్చించారు. అలాగే బీఆర్​ఎస్ ​లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్​ మాట్లాడుతూ.. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్​ రెడ్డి లాంటి వారు పార్టీ మారడాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

BRS MLAs Meet party president KCR at Erravalli Farmhouse

కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్​ఎస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి హయాంలో కూడా ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. హామీల అమలులో కాంగ్రెస్​ పార్టీ విఫలమైందని కేసీఆర్​ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కేసీఆర్. భవిష్యత్తులో బీఆర్​ఎస్‌​కు మళ్లీ మంచి రోజులు వస్తాయని కేసీఆర్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో తరచూ కలుస్తానని కేసీఆర్​ చెప్పారు.

కేసీఆర్​‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు కేటీఆర్​, హరీశ్ ​రావు, ప్రశాంత్​ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు వివేకానంద్​, గోపీనాథ్​, ప్రకాశ్​ గౌడ్​, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ముఠా గోపాల్​, ఎమ్మెల్సీ షేరి​ సుభాశ్​ రెడ్డిలతో పాటు మరికొంత మంది నేతలు ఉన్నారు. వీరందరికీ మాజీ సీఎం కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పార్టీకి మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+