వంద ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లిందట: ఆ సీనియర్‌కు కవిత చురకలు
నిజామాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాజకీయ పార్టీల వ్యూహాలు- ప్రతివ్యూహాలు, విమర్శలు- ప్రతి విమర్శల జోరుగా సాగుతున్నాయి. నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతోన్నాయి. పాదయాత్రలూ ఊపందుకుంటోన్నాయి.
ఈ ఏడాది నవంబర్/డిసెంబర్‌లల్లో తెలంగాణ సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్/అక్టోబర్‌లల్లో వెలువడే అవకాశం ఉంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి.. వ్యూహాలు పన్నుతోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. దీనికి ధీటుగా స్పందిస్తోన్నాయి.

ఈ పరిణామాల మధ్య బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో పాదయాత్రకు దిగారు. బీఆర్ఎస్‌కు గట్టిపట్టు ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. 2014, 2018 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి మహ్మద్ షకీల్ అహ్మద్ ఇక్కడి నుంచి గెలుపొందారు.
బోధన్ నుంచి కవిత పోటీ చేయొచ్చనే ప్రచారం కొనసాగుతోన్న నేపథ్యంలో ఆమె ఇదే నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కవిత..రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సంధించారు. ప్రత్యేకించి- కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు కవిత. ఆయనపై సెటైర్లు వేశారు. వంద ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లిందనే సామెత గుర్తుకొస్తోందంటూ ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత 62 సంవత్సరాల పాటు దేశాన్ని కాంగ్రెస్సే పరిపాలించిందని, పేదలు, ముస్లింల కోసం ఏం చేశారని ప్రశ్నించారు.
వంద ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లిందట: ఆ సీనియర్‌కు కవిత చురకలు..!#KalvakuntlaKavitha #MLCKavitha #BRSParty #Telangana #Oneindiatelugu pic.twitter.com/hfBEPb6yvE
— oneindiatelugu (@oneindiatelugu) August 16, 2023
గరీబీ హఠావో అంటూ నినదించిన కాంగ్రెస్ పేదల్ని తరిమేసిందే గానీ.. పేదరికాన్ని కాదని కవిత ధ్వజమెత్తారు. ఇంకా ఎన్నిసార్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో గానీ, దేశంలో గానీ ఎలాంటి మార్పులు రాలేదని విమర్శించారు. కారు, కేసీఆర్ సర్కారు వైపే తెలంగాణ ముస్లింలో నిలిచారని అ్నారు.












Click it and Unblock the Notifications