ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలి: MLC కవిత డిమాండ్

ఏపీ నిర్మిస్తున్న పోలవరం కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాలు ముంపునకు గురువుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దీనిపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యతిరేకించామని కవిత గుర్తు చేశారు. తాము సుప్రీం కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేశామని చెప్పారు. ముంపునకు గురవుతున్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.

రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చిందని కవిత గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం 2014లో తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి తెలంగాణకు చెందిన 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని దుయ్యబట్టారు. 460 మెగావాట్ల లోయర్‌ సీలేరు పవర్‌ ప్రాజెక్టును ఏపీకే అప్పగించినట్లు గుర్తు చేశారు. ముంపు గ్రామాలకు సంబంధించి ఈ నెల 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహిస్తున్నారని.. ఈ సమావేశంలో ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

BRS MLC Kavitha is fighting for the flooded villages in Polavaram

పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 36లక్షల క్యూసెక్కుల నుంచి 50లక్షల క్యూసెక్కులకు పెంచుకుంటూ పోవడంతో ముంపు పెరిగిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కారం చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. పురుషోత్తమపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ఆమె కోరారు. కాగా ఎమ్మెల్సీ కవిత జాగృతి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. సామాజిక తెలంగాణ కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నారు.

ఈ మధ్యే కవిత జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలవడంపై ఆమె ధర్నా చౌక్ లో ధర్నా చేశారు. బనకచర్ల ప్రాజెక్టు కూడా కవిత వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+