ప్రధాని మోడీ పెద్దన్న ఎలా అవుతారు?: రేవంత్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)పై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్‌​లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రధాని మోడీ పెద్దన్న ఎలా అవుతారని కవిత (Kavitha) ప్రశ్నించారు. ప్రధానిని పెద్దన్న అని సీఎం రేవంత్ రెడ్డి అనడం మంచిదే కానీ.. ఆ పెద్దన్న తెలంగాణకు ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు.

రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న బంధం బయట పడిందని కవిత చెప్పుకొచ్చారు. పెద్దన్న నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై ఉందని ఆమె అన్నారు. ప్రజాప్రతినిధుల విషయమై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఆ తీర్పును స్వాగతించిన ప్రధాని, ఆయా కేసుల దర్యాప్తు వేగవంతం తెలంగాణ నుంచే ప్రారంభించాలని కవిత కోరారు.

BRS MLC Kavitha slams revanth reddy for calls PM Modi as big brother

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మొదటి ముద్దాయిగా ఉన్నారని, కేసును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలన్నారు కవిత. సోనియాను బలిదేవత అన్న సీఎం ఇవాళ సోనియా, రాహుల్‌​ను పోటీకి ఆహ్వానిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని గుర్తు పెట్టుకొని ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఓటర్లకు కవిత పిలుపునిచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని కవిత మండిపడ్డారు. పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నీళ్లు ఇచ్చే ఆస్కారం ఉండి ఇవ్వకపోవడం రైతులపై కక్ష సాధింపు మాత్రమేనని కవిత కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

గురుకులాల ఉద్యోగాల నియామకాల్లో మహిళలకు కేవలం 12 శాతం ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని చాలా మంది మహిళలకు అన్యాయం జరిగినందున జీఓ నంబర్ 3ను తక్షణమే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో ఆడబిడ్డలకు అన్యాయం చేయవద్దని గతంలోనే కోరామని, 626 ఉద్యోగాల్లో కేవలం 77 మాత్రమే ఆడబిడ్డలకు వచ్చాయన్నారు. 33 శాతానికి పైగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు రావాల్సింది.. పోయి 12 శాతం మాత్రమే వస్తున్నాయని కవిత ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసిందని, మహిళలకు అన్యాయం చేయబోమని కేసీఆర్ అప్పీలుకు వెళ్లారని గుర్తు చేశారు ఎమ్మెల్సీ కవిత.

BRS MLC Kavitha : కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదో తేదీన ధర్నా చౌక్​లో నిరసన వ్యక్తం చేయనున్నట్లు కవిత ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్లు తెలిపారు. మార్చ్ ఎనిమిదో తేదీన జరిగిన ధర్నాకు మిగతా వాళ్లు కూడా కలిసి రావాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇస్తున్న ఉద్యోగ నియామకాలు అన్నీ కేసీఆర్ చేపట్టినవేనని రేవంత్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ డీఎస్సీ మాత్రమేనని చెప్పారు. గురుకుల నియామకాలను ఆరోహణా క్రమంలో నింపడం సరికాదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+