Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజ్యసభ ఎన్నికల వేళ కేసీఆర్ అనూహ్య నిర్ణయం, ఆట మొదలు...!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో బలాల ఆధారంగా రెండు స్థానాలను అధికార కాంగ్రెస్ దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే.. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పైన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇక, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీంతో.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల వేళ కొత్త లెక్కలు మొదలయ్యాయి.

తెలంగాణ నుంచి రాజ్యసభకు రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వీ, బీఆర్ఎస్ నేత సురేశ్ రెడ్డి రిటైర్మెంట్ వేళ ఈ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అసెంబ్లీలో సంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్ రెండు స్థానాలు తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్దమైంది. ఇందు కోసం సింఘ్వీకి తిరిగి రెన్యువల్ చేయాలని.. రెండో స్థానం నుంచి పార్టీ రాష్ట్ర నేతలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ తమ అభ్యర్ధిని రాజ్యసభ బరిలో నిలిపే అంశం పైన కసరత్తు చేస్తున్నారు. ముస్లిం వర్గాల కు సీటు ప్రకటిస్తే.. ఎంఐఎం మద్దతు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ లో బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాగా, అందులో పది మంది కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. వారిలో పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటు న్నారు. తాజాగా అసెంబ్లీలో ఉన్న లెక్కల ప్రకారం సభలోని 119 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే రానున్న రాజ్యసభ ఎన్నికల్లో కోటా 40.66 అవుతుంది. అంటే ఒక్కో సీటు గెలుచుకునేందుకు 41 ఓట్లు అవసరం పడుతుంది. రెండు స్థానాలకు 82 మంది బలం కావాల్సి ఉంటుంది.

brs-moving-with-new-strategy-for-rajaysabaha-elections-as-kcr-key-discussions-with-party-leaders

కాంగ్రెస్ అభ్యర్దుల ఖరారు తరువాత

కేసీఆర్ పోటీ నిర్ణయం వెనుక భారీ వ్యూహం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ వర్తిస్తుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు తాము ఏ అభ్యర్థికి ఓటు వేసారనేది పార్టీ ఏజెంట్‌కు తప్పకుండా చూపాల్సి ఉంటుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటువైపు ఓటు వేసేది తేలిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నా, ఫిరాయింపు ఎమ్మెల్యేల వైఖరిని ఎండగట్టే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే సమయంలో తాజా లెక్కలను విశ్లేషిస్తున్నారు. రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని బీజేపీ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉంటే, కోటా 38 అవుతుంది. రెండు స్థానాలకు 76 మంది బలం అవసరం అవుతుంది. కాంగ్రెస్‌కు ఉన్న 66 మందితో పాటు ఏడుగురు ఎంఐఎం, ఒక సీపీఐ సభ్యునితో కలిపి 74 మంది అవుతారు. రెండు సందర్భాల్లో రెండు సీట్లకు సరిపడా కోటా రాదు. కోటా రాకపోతే ద్వితీయ ప్రాధాన్య ఓట్లు, ఆ తర్వాత తొలగింపు ప్రక్రియ చేపట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లు మరింత కీలకం అవుతాయి. దీంతో.. వస్తే రాజ్యసభ సీటు.. లేకుంటే, ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఫిక్స్ చేయాలనేది కేసీఆర్ వ్యూహంగా ఉంది. దీంతో.. ఇప్పుడు కేసీఆర్ తుది నిర్ణయం చివరకు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+