ఎన్నికలు ఎప్పుడొచ్చినా 100 సీట్లు మావే..!
తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, గులాబీ పార్టీ (BRS) 100 సీట్లు గెలుచుకుంటుందని ఆయన సంచలనం సృష్టించారు. తాజాగా వరంగల్‌లో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాంగ్రెస్‌పై ఉన్న ఈ వ్యతిరేకతతో గులాబీ పార్టీకి మేలు జరుగుతుందని విశ్లేషించారు. అందుకే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా గులాబీ పార్టీకి 100 సీట్లు రావడం గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడం ఖాయమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

రెండు నెలల పాటు అన్ని పనులు పక్కన పెట్టి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలు, నేతలకు దిశా నిర్దేశం చేశారు. గులాబీ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించాలని సూచనలు చేశారు. అప్పుడే గులాబీ పార్టీ మరింత వేగంగా జనాల్లోకి వెళుతుందని వెల్లడించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. కాగా, దాదాపు 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న దయాకర్ రావు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో యువ నాయకురాలు యశస్విని రెడ్డిపై ఓడిపోయిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications