Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీఆర్ఎస్ రిమోట్ మోడీ చేతిలో: అమ్మాయిలకు స్కూటర్లు ఇస్తామంటూ ప్రియాంక

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రియాంకా గాంధీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. శ్రీకాంతాచారిని స్మరించుకుంటున్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని, ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నో జాతీయ సంస్థలు ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు.తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్ మ్యాప్ రూపొందించింది. మీ ఆశలు ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రియాంక గాంధీ అన్నారు.

brs remote in modis hand: priyanka gandhi slams kcr and bjp

బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ప్రియాంక అన్నారు. బీఆర్ఎస్ రిమోట్ మోడీ చేతిలో ఉందని ఆరోపించారు. శ్యాండ్, ల్యాండ్, వైన్స్, మైన్స్ మాఫియాతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిండిపోయిందని విమర్శించారు. మాఫియాను రక్షించేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల భూములను బీఆర్ఎస్ పెద్దలు లాక్కున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని ప్రజలను మోసం చేశారని కేసీఆర్‌పై ప్రియాంక ధ్వజమెత్తారు.

తెలంగాణలో సామాజిక న్యాయం ఎక్కడుందని ప్రియాంక ప్రశ్నించారు. ముగ్గురు మంత్రులు ఒకే కుటుంబానికి చెందినవారున్నారని.. వారి చేతిలోనే 18 శాఖలున్నాయన్నారు. మంత్రి వర్గంలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు ప్రియాంక గాంధీ. తన దోస్తులైన ప్రైవేట్ శక్తులకు ఈ దేశాన్ని అమ్మేస్తున్నారని మోడీపై ఆరోపణలు గుప్పించారు.

బీఆర్ఎస్ నేతలు రూ. వందల కోట్లు లూటీ చేసి భారీ భవనాలు కట్టుకున్నారన్నారని ప్రియాంక ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు.. కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగ నియామక ప్రక్రియలో అక్రమాలు జరుతుతున్నాయి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న యువతి క్యారెక్టర్ పై నింద వేశారు. నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు ప్రియాంక. 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పారు.

మేం అధికారంలోకి వస్తే గల్ఫ్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఆదివాసీలు, గిరిజనులు అంటే ఇందిరాగాంధీకి చాలా ఇష్టం. ఆదివాసీల హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తోంది. మేము పోడు రైతులకు పట్టాలు ఇస్తే... బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేసింది. ఏ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలను అమలు చేశామని ప్రియాంక చెప్పుకొచ్చారు. రామప్ప ఆలయంలో అద్బుతమైన దర్శనం చేసుకున్నామని ప్రియాంక తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు ప్రియాంక.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+