Telangana Assembly Election 2023: పోల్ మేనేజ్‍మెంట్‍లో దూసుకెళ్తోన్న బీఆర్ఎస్..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతోంది. వచ్చే మంగళవారంతో ప్రచారానికి తెరపడనుంది. అప్పటి నుంచి అన్ని పార్టీలకు పోల్ మేనేజ్‍మెంట్ కీలకం కానుంది. నెక్ టూ నెక్ ఉన్న నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్‍మెంట్ చాలా కీలకం అవుతుంది. అందుకే అభ్యర్థులు ఇప్పటి నుంచే బూత్ స్థాయి కమిటీలు వేస్తున్నారు. గ్రామస్థాయి నాయకులను అలర్ట్ చేస్తున్నారు. పోలింగ్ కు ముందు రోజు ఓటర్లను డబ్బులు, లిక్కర్ తో ప్రలోభపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
పోల్ మేనేజ్‍మెంట్ లో బీఆర్ఎస్ ముందున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించారు. గ్రామస్థాయి నాయకులను సిద్ధం చేశారు. ఓటర్ల మొబిలైజేషన్, ఓటర్లతో ఓటు వేయించే బాధ్యతను గ్రామస్థాయి నాయకులకు అప్పగించారు. సాధారణంగా అధికార పార్టీ నాయకులకు పోల్ మేనేజ్‍మెంట్ కాస్త సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికి తెలిసిన అధికారులు, పోలీసులు ఉంటారు.

అయితే అన్ని చోట్ల అధికార పార్టీకి పోల్ మేనేజ్‍మెంట్ సులభం కాదని గుర్తుంచుకోవాలి. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గ్రామస్థాయిలో పటిష్ఠమైన కేడర్ లేదు. అప్పట్లో వారి పోల్ మేనేజ్‍మెంట్ కూడా బలహీనంగా ఉండేది. అయినప్పటికీ బలమైన వేవ్ తో అధికారంలోకి వచ్చింది. కానీ బీఆర్ఎస్ 2018లో అద్భుతమైన పోల్ మేనేజ్‍మెంట్ తో ముందుకెళ్లి విజయం సాధించింది. ఇప్పుడు కూడా పోల్ మేనేజ్‍మెంట్ సరిగా నిర్వహించి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. ఇటు కాంగ్రెస్, బీజేపీలు పోల్ మేనేజ్‍మెంట్ లో వెనకబడ్డాయి.
చాలా మంది కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో హస్తం గాలి వీస్తుందని పోల్ మేనేజ్‍మెంట్ నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఆ పార్టీని దెబ్బ కొట్టే అవకాశం ఉంది. కొంత మంది కాంగ్రెస్ అభ్యర్థులు పోల్ మేనేజ్‍మెంట్ జాగ్రత్తగా చేస్తున్నా.. మరి కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 నుంచి 15 స్థానాల్లో తీవ్రంగా పోటీ ఉంది. ఇక్కడ 1000 నుంచి 5000 వేల ఓట్ల తేడాతో గెలిచే అవకాశం. ఇక్కడ ప్రతీ ఓటు కీలకం కానుంది. ఇలాంటి చోట పోల్ మేనేజ్‍మెంట్ సరిగా చేసిన వారు విజయం సాధించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications