మీ అభిమానం సల్లగుండ- పాలాభిషేకంతో తడిచి ముద్దయిన తెలంగాణ మంత్రి

మహబూబ్ నగర్: పర్యాటకం, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఇవ్వాళ మహబూబ్ నగర్‌లో విస్తృతంగా పర్యటించారు. ఇది ఆయన సొంత నియోజకవర్గం. రెండుసార్లు ఇక్కడి నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నియోజకవర్గం సుందరీకరణ పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాలను సందర్శించారు. నేరుగా స్థానికులను కలుసుకున్నారు. వారు ఎదుర్కొంటోన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సుందరీకరణలో భాగంగా మహబూబ్ నగర్ ఆర్ అండ్ బీ సర్కిల్ జంక్షన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన టీ కప్, ఫిరంగిని ప్రారంభించారు. వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్ట్ కింద తయారు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారాయన. ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే ఇలాంటి సుందరీకరణ పనులు జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించడంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం వాటిని నిర్మించింది.

V Srinivas Goud

వాటిని ప్రారంభించిన అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానిక బీకే రెడ్డి కాలనీలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటోన్న సమస్యంల గురించి అధికారుల వద్ద ఆరా తీశారు. ఎలాంటి సమస్యలనైనా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదిక పెండింగ్ పనులను పూర్తి చేయాల్సి ఉంటుందనీ సూచించారు.

అనంతరం శ్రీనివాస్ గౌడ్- స్థానిక అంగన్‌వాడి కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించారు. వారితో సరదాగా ఫొటోలు దిగారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. మధ్యాహ్న భోజనం కింద పిల్లలకు వడ్డించడానికి సిద్ధంగా ఉంచిన ఆహారాన్ని ఆయన తనిఖీ చేశారు. స్వయంగా రుచి చూశారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ, సహకారాల గురించి అంగన్‌వాడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బీకే రెడ్డి కాలనీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస్ గౌడ్‌కు పాలాభిషేకం చేశారు. బిందెలతో తీసుకొచ్చిన పాలను ఆయన తలపై గుమ్మరించారు. శ్రీనివాస్ గౌడ్ జిందాబాద్, జై శీనన్న అంటూ నినాదాలు చేశారు. తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఆయనను తమ భుజాలపైకి ఎక్కించుకుని, బీకే రెడ్డి కాలనీలో ఊరేగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+