Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీఆర్ఎస్ కనుమరుగే: డెడ్‌లైన్ ఫిక్స్ చేసిన మహేశ్ కుమార్ గౌడ్

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. పదేళ్లలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదని.. కేవలం దోపిడీనే జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయిందని.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకుందని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుల సమన్వయ సమావేశానికి హాజరైన సందర్భంగా హనుమకొండలో ఆయన మాట్లాడారు.

ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డ, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లాయని.. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడున్నారని మండిపడ్డారు.

BRS will not exist by next elections TPCC chief Mahesh Kumar Goud

ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు మహేశ్ కుమార్ గౌడ్. అధికారం కోల్పోయామనే అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదని మహేశ్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాల కన్నా ఏడాది వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే ఎక్కువ అని అన్నారు.

దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని.. మిగితా రాష్ట్రాల్లోనూ తెలంగాణ తరహా పథకాలు కావాలని అడుగుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. కులగణనతో దేశానికే రూల్ మోడల్‌గా తెలంగాణ నిలుస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో బీఆర్ఎస్ నేతలతో చర్చకు సిద్ధమన్నారు. మూసీ పునరుజ్జీవ చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవం ఒక మహోత్తరమైన ఆలోచన అని ప్రశంసించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రాను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. హైడ్రా అంటే గత బీఆర్ఎస్ పాలనలోని భూ బకాసురులకే భయమని.. హైడ్రాతో పేదలకు ఎలాంటి భయం, ఆందోళన అవసరం లేదన్నారు. అన్ని రకాలుగా ప్రజలను మెప్పించామన్నారు. అందుకే విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నామన్నారు. వరంగల్ విజయోత్సవ సభకు 'ఇందిరా మహిళా శక్తి సభ'గా నామకరణం చేసినట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+