70కిపైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం: ఎగ్జిట్ పోల్స్‌పై కేటీఆర్ తేల్చేశారిలా
భారత రాష్ట్ర సమితి (BRS) 70కిపైగా స్థానాల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి కంగారు పడాల్సిన పని లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత గురువారం రాత్రి తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
Recommended Video

ఈరకమైన ఎగ్జిట్ పోల్స్‌ను గతంలోనూ చూశాం. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని నిరూపించడం మాకు కొత్తేమీ కాదు. డిసెంబర్ 3న 70కి పైగా స్థానాలతో విజయం సాధిస్తాం. ఎగ్జిట్ పోల్స్‌ను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని మీడియా సంస్థలు సర్వేలు చేయకుండా.. ఏదో 200 మందిని అడిగినట్టు చేసి.. దాన్ని గొప్పగా చేసి చూపిస్తారు. గతంలో 5 మీడియా సంస్థలు సర్వేలు చేస్తే.. అందులో ఒక్కటే నిజమైంది' అని మంత్రి కేటీఆర్ తేల్చేశారు.

ప్రజలు ఇంకా లైన్‌లో ఉండి ఓట్లు వేస్తూనే ఉన్నారని.. అప్పుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడటమేంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అస్సలు ఏ లాజిక్‌తో ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందని అన్నారు. ఒకవేళ డిసెంబర్ 3న ఎగ్జిట్ పోల్స్ తప్పు అయితే.. తప్పు జరిగిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని ఎగ్జిట్ పోల్స్ ప్రచురించిన మీడియా సంస్థలను కేటీఆర్ నిలదీశారు.
తెలంగాణ ప్రజలెవ్వరూ కన్ఫ్యూజన్ కావద్దని.. వందకు 100 శాతం అధికారంలోకి వస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. గత 90 రోజులుగా కష్టపడ్డ మా కార్యకర్తలు, నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంకా గంట, గంటన్నర సేపు పోలింగ్ జరిగేది ఉందని.. 70కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ఇంకా పోలింగ్ శాతం తేలలేదని.. ఫైనల్ పోలింగ్ ఎంత జరిగిందనేది శుక్రవారం ఉదయం తేలుతుందని తెలిపారు. ఎంత పోలింగ్ అయ్యింది.. ఎక్కడ ఎంత అయ్యింది.. ఏ నియోజకవర్గంలో ఎంత అయ్యిందనేది అనాలసిస్ చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications