బీఆర్ఎస్ కేడర్ కు కేటీఆర్ శుభవార్త - గెలుపుపై ఇదీ తాజా లెక్క..!!
తెలంగాణలో గెలుపెవరిది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. కేటీఆర్ వీటితో విభేదించారు. ఎగ్జాక్ట్ పోల్స్ లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ శాతం పై క్లారిటీ..ఓటింగ్ సరళి పై తుది నివేదిక వచ్చిన తరువాత తమకు ఎన్ని స్థానాలు వస్తాయో స్పష్టం చేస్తామని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ పార్టీ శ్రేణులకు గుడ్ న్యూస్ చెప్పారు. పోలింగ్ కు సిద్దం అవుతున్న వేళ గులాబీ నేతల్లో కేటీఆర్ ఇచ్చిన సందేశం టానిక్ లా మారుతోంది.
అధికారంపై ధీమా : తెలంగాణలో పోలింగ్ తరువాత మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అధికారం ఖాయమని తేల్చాయి. కానీ, మరి కొన్ని హంగ్.. మరి కొన్ని బీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలు వెల్లడించాయి. మంత్రి కేటీఆర్ ఈ ఎగ్జిట్ పోల్స్ ను తిరస్కరించారు. తాము 70 సీట్లకు పైగా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేసారు. తుది పోలింగ్ శాతం వచ్చిన తరువాత ఫలితం పై క్లారిటీ వస్తుందన్నారు. కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ కు 25 సీట్లు వస్తాయని చెబుతోంది. ఈ పోరులో బీజేపీ అందరి అంచనాలను దాటుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, పోలింగ్ రాత్రి వరకు కొనసాగింది. చివరగా పోలింగ్ శాతం 70.66 గా ఎన్నికల సంఘం తేల్చింది. 2018 లో పోలింగ్ శాతం 73.74 శాతంగా ఉంది. ఇదే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స అంచనాల పైన సందేహాలకు..తుది ఫలితాలపైన ఉత్కంఠకు కారణమవుతోంది.

ప్రజానాడి పై అంచనాలు : ఈ ఫలితాల పైన బీఆర్ఎస్ వార్ రూమ్ లో సుదీర్ఘ చర్చలు..విశ్లేషణలు చేసారు. అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ కు సీట్లు - ఓట్లు పెరిగినా అధికారం దక్కించుకొనే స్థాయిలో లేదనే నిర్దారణకు వచ్చారు. బీజేపీకి వచ్చిన ఓట్ల పైన విశ్లేషణ చేసారు. అంతిమంగా తెలంగాణ ప్రజల తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని పైనే మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలా రోజుల తరువాత మంచి నిద్ర దొరకిందని..ఎగ్జిట్ పోల్స్ హైక్ చేసినా..ఎగ్జాక్ట్ ఫలితాలు మాత్రం శుభవార్త ఇస్తాయని కేటీఆర్ తన ట్వీట్ లో స్పష్టం చేసారు. దీని ద్వారా కౌంటింగ్ తరువాత వచ్చే ఫలితాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు.
After a long time had a peaceful sleep 😴
— KTR (@KTRBRS) December 1, 2023
Exit polls can take a hike
Exact polls will give us good news. 👍#TelanganaWithKCR
అధికారం దక్కేదెవరికి : దాదాపు 30 నియోజకవర్గాల్లో బీజేపీ ఫలితాన్ని నిర్దేశించే స్థాయికి చేరిందని బీఆర్ఎస్- కాంగ్రెస్ అంగీకరిస్తున్నాయి. తమ వ్యతిరేక ఓటునే బీజేపీ చీల్చిందని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ హైప్ చేసినంత స్థాయిలో అనుకూలత ఉంటే గతం కంటే దాదాపు 4 శాతం పోలింగ్ ఎలా తగ్గుందని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కు సీట్లు పెరుగుతాయి కానీ అధికారంలోకి వచ్చే ఫిగర్ సాధించలేదరనేది అంతర్గత చర్చల్లో చెబుతున్న మాట. కానీ, ఓటింగ్ సరళి తమకు అధికారం ఖాయమని తేల్చుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఓటరు నాడి అర్దం కాని నియోజవకర్గాలు ఉన్నాయి. ఇక, పూర్తి విశ్లేషణ తరువాతనే కేటీఆర్ ఈ ట్వీట్ చేసారని చెబుతున్నారు. మరి..నిజంగా కేటీఆర్ భావిస్తున్నట్లుగా బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా..అధికారం హస్తగతం అవుతుందా అనేది 3వ తేదీన తేలనుందది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications