సర్కార్ ఉత్సవాలకు ధీటుగా బీజేపీ యాక్షన్ ప్లాన్.!ఈ నెల22 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై బీఎస్కే కసరత్తు.!
హైదరాబాద్: దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన విజయాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో అందుకు ధీటుగా బీజేపీ యాక్షన్ ప్లాన్ ను అమలు చేసేందుకు సిద్ధమైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ చంద్రశేఖర్ రావు పాలనలో ఏ విధంగా దెబ్బతిన్నదనే అంశంపై ఆయా రంగాల వారీగా వివరించడంతోపాటు వినూత్న రూపాల్లో నిరసనలు తెలపాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు శనివారం రైతు దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకు భిన్నంగా చంద్రశేఖర్ రావు పాలనలో వ్యవసాయ రంగం ఏ విధంగా దెబ్బతిన్నది? అనే అంశంపై బీజేపి కార్యాచరణ రూపొందిస్తోంది.
రైతు వ్యతిరేక విధానాలపై శనివారం నిరసనలు : రైతులకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన తీరును జనంలోకి తీసుకెళ్లేందుకు బీజేపి సన్నద్దమైంది. అందులోభాగంగా రేపు ఒకవైపు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తూనే, మరోవైపు కిసాన్ మెర్చా ఆధ్వర్యంలో నిరసనలు తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (BSK) ఆదేశం మేరకు నాలుగు రోజుల క్రితమే బీజేపీ నేతలు యాక్షన్ ప్లాన్ పై కసరత్తు చేశారు. రాష్ట్రంలోని పార్టీ సీనియర్ నేతలందరనీ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు.















Click it and Unblock the Notifications