RS Praveen Kumar: మీలాగా నేను ఫోన్‍ను ధ్వంసం చేయలేను.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేశారు. తన ఐ ఫోన్‌ను ప్రభుత్వం హ్యాక్ చేస్తోందంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. తనకు యాపిల్ నుంచి అలర్ట్ వచ్చిందన్నారు. తన ఫోన్ హ్యాక్ అవుతోందంటూ.. యాపిల్ సంస్థ నుంచి మెయిల్ వచ్చిందని వెల్లడించారు. వచ్చిన మెయిల్ ను స్క్రీన్ షార్ట్ తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
ప్రభుత్వాలు మీ ఫోన్ హ్యాక్ చేస్తున్నాయి జగ్రత్తగా ఉండాలి యాపిల్ తనను హెచ్చరించిందని పేర్కొన్నారు. మీలాగా నేను ఫోనును ధ్వంసం చేయలేను అని పరోక్షంగా ఎమ్మెల్సీ కవితను విమర్శించారు. దోపిడి, చీకటి నుంచి ప్రజలకు విముక్తి కలిగించి మహానీయులు కలలు గన్న రాజ్యాన్ని తీసుకోస్తామని చెప్పారు.

"ప్రభుత్వాలు నా ఆ ఫోన్ ను హ్యాక్ (Hack) చేస్తున్నాయి,జాగ్రత్తగా ఉండమని @Apple నన్ను హెచ్చరించింది. మీ లాగా నేను నా ఫోన్ ను ధ్వంసం చేయను.😊కానీ మీ దోపిడి-చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి, మా మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా👊" అని ట్వీట్ చేశారు.
ప్రభుత్వాలు నా iPhoneను హ్యాక్ (Hack) చేస్తున్నాయి,జాగ్రత్తగా ఉండమని @Apple నన్ను హెచ్చరించింది. మీ లాగా నేను నా ఫోన్ ను ధ్వంసం చేయను😊కానీ మీ దోపిడి-చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి, మా మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా👊 @BRSparty @BJP4India pic.twitter.com/F3AWo3cjR1
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 1, 2023
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బహుజన రాజ్యాధికార యాత్ర చేస్తున్నారు. తెలంగాణ బీఎస్పీ బలాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన తన ఐపీఎస్ పదవీ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఇప్పటికే కొంత మంది రాజకీయ నాయకులు.. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణలో బీజేపీ నేతలు తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications