చాటింగ్ వద్దని తల్లి మందలించినందుకు ఉరేసుకున్న బిటెక్ విద్యార్థి
హైదరాబాద్: సెల్‌ఫోన్ చాటింగ్ చేయవద్దని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్మ చేసుకున్నాడు. హైదరాబాదులోని షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ కథనం ప్రకారం - గోషామహల్ ప్రాంతంలో నివసించే లక్ష్మి, లక్ష్మీనారాయణ కుమారుడు ప్రసాదమ్ యశ్వంత్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
గత కొద్ది రోజులుగా తరచూ ఫోన్‌లో చాటింగ్ చేస్తూ కనిపించడంతో వారం రోజుల క్రితం తల్లి లక్ష్మి మందలించింది. అప్పుడు ప్రసాదమ్ యశ్వంత్ ఎడమ చేతిపై బ్లేడ్‌తో కోసుకుని బెదిరించాడు. శుక్రవారం ఫోన్ చాటింగ్ చేస్తున్న యశ్వంత్‌ను మరోసారి మందలించి సెల్‌ఫోన్ లాక్కుంది.

దీంతో యశ్వంత్ గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఎస్‌ఐ శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే, హైదరాబాదులోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. ఎస్‌ఐ రంజిత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం - సురేష్‌రెడ్డి కుమారుడు ఎం .సందీప్‌రెడ్డి(13) 8వ తరగతి చదువు తున్నాడు. 23న కాలనీలోని గణనాథుడిని చూసి వస్తానని చెప్పి తిరిగి రాలేదు.
దీంతో శుక్రవారం సురేష్‌రెడ్డి మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications