బుల్లెట్ బండి పాట ట్రెండింగ్ ; స్టెప్పులేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య .. వీడియో వైరల్
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బుల్లెట్ బండెక్కి వచ్చేత్తా పా అంటూ ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తుంది. సోషల్ మీడియాలో సైతం ఇదే పాట వైరల్ గా మారింది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ పాటకు స్టెప్పులేసి ఇరగదీస్తున్నారు. మొన్నటికి మొన్న మహబూబాబాద్ ఎంపీ కవిత ఓ పెళ్లిలో బుల్లెట్ బండి పాట కు అదిరిపోయేలా డాన్స్ చేసి సందడి చేస్తే, ఇక తాజాగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చిన్నారులతో కలిసి చిందులేశారు.

బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆడి పాడారు. ఉత్సాహంగా గడిపారు. బుల్లెట్ బండెక్కి వచ్చేత్తా పా అంటూ పాటకు తగ్గట్టు రిథమిక్ గా స్టెప్పులేశారు. తాటికొండ రాజయ్య డాన్స్ చేయడం చూసిన అక్కడివారంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా బుల్లెట్ బండి పాట హడావుడే కనిపిస్తుంది.

ఎక్కడ చూసినా ఆ పాటే .. ఆస్పత్రిలో పేషెంట్లు సైతం బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్
పెళ్లి వేడుకల దగ్గరనుండి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసే వరకు ఎక్కడ చూసినా బుల్లెట్ బండి పాట సంచలనంగా మారింది. ఇక జంతువులకు కూడా బుల్లెట్ బండి పాట తెగ నచ్చేసింది. కొండముచ్చు బుల్లెట్ బండి పాట వింటేనే పాలు తాగుతున్న ఘటనలు సైతం వెలుగుచూశాయి. ఒక పెళ్లి బరాత్ లో నవ వధువు సాయిశ్రీయ చేసిన డాన్స్ తో బుల్లెట్ బండి పాట సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. మొన్నటికి మొన్న పక్షవాతం వచ్చిన రోగికి త్వరగా కోలుకోవడానికి ఒక నర్సు వినూత్న ఆలోచనతో ప్రయత్నం చేసింది. బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేసేందుకు ప్రయత్నించేలా సదరు పేషెంట్ ను ప్రోత్సహించింది.

పాటకు స్టెప్పులేసి జోష్ నింపుతున్న రాజకీయ నాయకులు
అతని పక్కనే మరో నర్సు కూడా, అతను కాళ్లు చేతులు కదిలించడానికి ప్రేరేపించగా, ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. హాస్పిటల్లో పక్షవాతంతో మంచం పట్టిన ఓ వ్యక్తి త్వరగా కోలుకోవాలని కోసం ఫిజియోథెరపీ చెయ్యడానికి ఈ పాటను వాడటంపై బయట ప్రజల్లో ఆసక్తికర చర్చ జరిగింది. సంగీతానికి రాళ్ళు జరుగుతాయో లేదో కానీ రోగుల్లో మాత్రం మార్పు వస్తుందని తెలియజేసే ప్రయత్నం చేశారు ఆసుపత్రి సిబ్బంది. ఇదిలా ఉంటే ఇక రాజకీయ నాయకులు సైతం బుల్లెట్ బండి పాటకు డాన్సులు వేస్తూ ప్రజల్లో జోష్ నింపుతున్నారు.

వేలంవెర్రిగా మారిన పాట ... జెట్ స్పీడ్ లో సోషల్ మీడియాలో దూసుకుపోతున్న బుల్లెట్ బండి
ఫంక్షన్ ఏదైనా, సందర్భం ఏదైనా, ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తున్న తీరు కనిపిస్తుంది. కొందరు ఇది ఒక వేలంవెర్రి అంటూ ఈ పాట విషయంలో నిట్టూరుస్తూ ఉంటే, మరికొందరు ఈ పాటకు స్టెప్పులేస్తూ తెగ హడావుడి చేస్తున్నారు. ఇక పెళ్లిళ్లలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేయడం ఒక ఆనవాయితీగా మారుతున్న పరిస్థితి ప్రస్తుతం పెళ్లిళ్లలో కనిపిస్తుంది. ఎవరి నోట విన్నా ఈ పాటే, ఎవరు డాన్స్ చేసిన ఈ పాటకే అన్నట్టుగా ప్రస్తుతం బుల్లెట్ బండి పాట జెట్ స్పీడ్లో దూసుకు పోతోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications