మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ అవుట్..? రేవంత్ రెడ్డి కొత్త టీం ఇదే..!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు మూహార్తం ఖారారు కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతుంది.దీంతో మంత్రివర్గ విస్తరణ గురించి కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఆశావాహులు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఉగాదికి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణపై ఈ రోజు(సోమవారం) ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చిందని చర్చించుకుంటున్నారు.

Cabinet expansion in Telangana These are the names on the list

ప్రస్తుతం రాష్ట్రంలో 6 మంత్రి పోస్టులు ఖాళీగా ఉండగా.. ఎవరెవరికి ఇవ్వాలన్న విషయంపై కూడా అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి, ఒక ముస్లిం సామాజికవర్గానికి, ఒక ఎస్సీకి అవకాశం లభించే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. బీసీ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రెడ్డి కోటాలో.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉండగా.. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.

ఇక మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ మీర్ అమీర్ అలీఖాన్‌కు ఛాన్స్ ఉంది.ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి పేరు కూడా మంత్రి రేసులో వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులను తొలగిస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ, జూపల్లి కృ‌ష్ణారావులను మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. వరుస వివాదాల్లో నిలిచిన కారణంగానే కొండా సురేఖ మంత్రి పదవి కోల్పుతున్నారనే చర్చ పార్టీలో కూడా కొనసాగుతోంది. కొత్త మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకునే నాయకుల లిస్ట్ మరో రెండు రోజుల్లో వెల్లడి కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+