మాకు కత్తులు దొరకవా.?మేము నాలుకలు కోయలేమా.? టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డి కాంగ్రెస్.!
హైదరాబాద్ : ఇంద్రవెల్లి సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో టిఆర్ఎస్ నేతల గుండెల్లో దడ పుట్టిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దళిత గిరిజన దండోరా తో కలుగులో పండుకున్న నాయకులంతా బయటకు వచ్చి అరుస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన బాష కొత్తగా వచ్చింది కాదని, గత కొన్నేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట్లాడిన బాషనే మాట్లడారని గుర్తు చేసారు. ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులకు బాష గురించి తెలిసిందా అంటూ సూటిగా ప్రశ్నించారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే లు రేవంత్ రెడ్డి పైన మాటల దాడి చేస్తున్నారని, వారు మంత్రులుగా ఉండి కాళ్ళు విరగ్గొడతాం, నాలుక కోస్తాం అనడం ఏంటని ప్రశ్నించారు.

ఇంద్రవెల్లి సభకు పెద్ద సంఖ్యలో దళిత, గిరిజన ప్రజలు తరలి వచ్చారని, దీంతో సభ విజయవంతం అయ్యిందని, ఇదే అంశాన్ని టీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కత్తులు, కటారులు పట్టుకుని తిరుగుతున్నారా, నాలుకలు కోస్తాం అంటున్నారు, మాకు కత్తులు దొరకవా.? మేము నాలుకలు కోయలేమా.? అని సూటిగా ప్రశ్నించారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, చంద్రశేఖర్ రావు జైలుకు వెళ్లడం తథ్యమని శ్రవణ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించినప్పుడు వివరణ ఇచుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీపైన ఉంటుందని, అందుకు విరుద్దంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఎదురు దాడులు చేస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు. తెల్ల రేషన్ కార్డుకు బియ్యం తెచ్చుకుని తినేవారికి బెంజ్ కార్లు ఎలా వచ్చాయని, రేవంత్ రెడ్డి జైలుకు వెళతారని గులాబీ నేతలు అంటున్నారని, వారీ భాగోతాలు మాకు తెలియవా అని శ్రవణ్ ఎద్దేవా చేసారు.












Click it and Unblock the Notifications