Group-1 Mains: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలా.. వద్దా..!
రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలు సీరియల్ ఎపిసోడ్ లా కొనసాగుతోన్నాయి. పేపర్ లీక్ తో ఇప్పటికే పలు మార్లు గ్రూప్-1 రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతా గ్రూప్-1 మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమ్స్ కూడా నిర్వహించారు. ఇప్పుడు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ సంబంధించి టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గ్రూప్-1 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 563 పోస్టులకు జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 3.02 లక్షల మంది హాజరయ్యారు.
వీరిలో 31,382 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. గ్రూప్-1 మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మెయిన్స్ లో 6 పేపర్లు ఉండగా.. ప్రతీ పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. అయితే గ్రూప్-1 మెయిన్స్ రీ షెడ్యూల్ చేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ లోని అశోక్ నగర్‌లో మెరుపు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు.

అభ్యర్థులు భారీ సంఖ్యలో వచ్చి రోడ్డుపై ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించారు. జీవో 29 సవరించి పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. పరీక్షలు వాయిదా వేసుకుంటూ వెళ్తే.. ఉద్యోగాలు రావడం కష్టమని కొంత మంది అభ్యర్థులు చెబుతున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు ఉన్నాయని పలువురు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. రిజర్వేషన్ల విషయంలో కొంత మంది కోర్టు ఆశ్రయించారు. వీరి పిటిషన్లు విచారించిన హైకోర్టు వాటిని కొట్టి వేసింది.
కాగా గ్రూప్-1 అభ్యర్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ కలువనున్నారు. అయితే గ్రూప్-1 పేపర్ లీక్ బీఆర్ఎస్ హయాంలోనే జరగ్గా.. ఇప్పుడు అభ్యర్థులు అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ను కలవడం సరైందనా.. కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications