ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
సూర్యాపేట: కోదాడలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని వెనుక నుంచి వేగంగా కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారితో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో కారులో పది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు ఘటనా స్థలంలోని మృతి చెందారు. గాయపడిన మరో నలుగురిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, హైదరాబాద్ నగరంలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన వీరంతా చిన్నారి చెవులు కుట్టించేందుకు గురువారం ఉదయం విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జిల్లా శ్రీకాంత్, లాస్య, ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందపురం గ్రామానికి చెందిన కృష్ణంరాజు, మాణిక్యమ్మ, చంద్రారావు, స్వర్ణగా గుర్తించారు. ఆరుగురు కుటుంబసభ్యులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది.
బస్సు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట శివారు ఆకేరు వాగు బ్రిడ్జి వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు ఢీకొని నలుగరు విద్యార్థులు మృతి చెందారు. వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లేపాక సిద్ధు, వరుణ్ తేజ్, పొన్నాల రనిల్ కుమార్ లు ఒకే బైక్‌పై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో విద్యార్థి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.












Click it and Unblock the Notifications