చేతులూ కాళ్లూ కట్టేసి ఎడారిలో సలసల కాగే ఇసుకలో వేసి చంపారు
హైదరాబదా్: ఓ తెలుగు వ్యక్తిని కాళ్లూ, చేతులూ కట్టేసి ఎడారిలో సుర్రుమని కాలే ఇసుకలో వేసి చంపిన కేసును మూసివేశారు. ఈ మేరకు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి. ఐదుగురు మలయాళీలను సజీవంగా పాతిపెట్టగా, మృతుల్లో ఒకరి చేతివేలికి ఉన్న ఉంగరం, దానిపై అతడి పేరు ఆధారంగానే వారు భారతీయులని గుర్తించి, పోలీసులు కేసును ఛేదించారు.
ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి వార్తాకథనం ప్రకారం - ఆరేళ్ల తర్వాత దోషులకు మరణ శిక్ష కూడా పడింది. కానీ, ఓ తెలుగువాడిని కాళ్లూ, చేతులు కట్టి ఎడారిలో వేసి చంపిన కేసును మాత్రం మూసివేశారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన నారాగౌడ్‌ను కూడా దమ్మాం రాష్ట్రంలోని హాఫర్ అల్ బాతీన్‌లో కాళ్ళు, చేతులను తాళ్ళతో కట్టి ఇసుకలో వేశారు. దీంతో ఎడారిలో దాహం, ఆకలితో అలమటించి అతడు మరణించాడు. అయితే, ఈ కేసులో దోషులకు శిక్ష పడేలా చేసేందుకు ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో చివరకు ఈ కేసు మూతపడింది.
ఐదుగురు మలయాళీలను అమానుషంగా చిత్రహింసలు పెట్టి, నోటికి ప్లాస్టర్ టేపులు అతికించి కిరాతకంగా సమాధి చేసిన ముగ్గురు సౌదీ అరేబియా జాతీయులకు సౌదీలోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. మృతుల్లో ఒకరి చేతికి బంగారు ఉంగరం, దానిపై అతడి పేరు ఉండటంతో దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తుచేసారు.

సౌదీలోని దమ్మాం ప్రాంతంలో సఫ్వా అనే గ్రామం వద్ద గల ఓ వ్యవసాయ క్షేత్రాన్ని 2014లో లీజుకు తీసుకున్న ఓ సౌదీ జాతీయుడు దానిని దున్నుతుండగా అస్థిపంజరాలు బయటపడటంతో 2010లో జరిగిన ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. తన కూతురును వేధించడంతో తాను ఇతర సౌదీ మిత్రులతో కలిసి చితకబాదామని, అనంతరం వారి నోళ్ళను మూసి పాతిపెట్టినట్లుగా సౌదీ జాతీయుడు పోలీసుల ముందు ఆంగీకరించాడు.
మృతులలో కొందరి కుటుంబాలు తమ వాళ్ళ ఆచూకీ తెలియడం లేదని భారతీయ ఎంబసీకి గతంలోనే ఫిర్యాదు చేశారు. కానీ వారు మరణించినట్లు ఎంబసీకి కూడా తెలియదు.












Click it and Unblock the Notifications