పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు: ఎందుకంటే?

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విధులకు ఆటంకం కలిగించడంతోపాటు బెదిరింపులకు గురిచేశారంటూ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డి సహా 20 మంది అనుచరులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, బుధవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నవారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే, అదే సమయంలో బయటికి వెళ్తున్న సీఐని గమనించి తన ఫిర్యాదు స్వీకరించిన తర్వాతే వెళ్లాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

Case registered against MLA Padi Kaushik Reddy in Banjara Hills PS

అయితే, అర్జెంట్ పని ఉందని బయటకు వెళ్తున్నా.. తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటానని సీఐ చెప్పడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సీఐ వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు. దీంతో సీఐ వెనక్కి వచ్చి ఫిర్యాదు పత్రం తీసుకున్నారు.

అంతకుముందు సీఐపై కౌశికర్ రెడ్డి పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని డ్యూటీ చేయాలంటూ సీఐని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ విషయం తేలుస్తామంటూ హెచ్చరించారు. తమ ప్రభుత్వం వచ్చాక తనకు మీరే సెల్యూట్ చేస్తారంటూ వ్యాఖ్యానించారు. తమను చూసికూడా ఫిర్యాదు తీసుకోకుండా పారిపోతున్నారంటూ కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వార్డు మెంబర్‌గా కూడా గెలవని సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లకు సెల్యూట్ కొడతారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వాలో తెలుసుకోవాలని.. అసెంబ్లీ రూల్ బుక్ చదువుకో సీఐకి అని చెప్పారు.
నాలుగేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని.. అప్పుడు చెప్తామంటూ సీఐతో కొంతసేపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదైంది.

మరోవైపు, చక్రధర్ గౌడ్ ఒక బ్రోతల్, బ్రోకర్ కేసు పెడితే ఎలాంటి ఆధారాలు లేకున్నా పోలీసులు హరీష్ రావు గారిపై FIR ఎలా నమోదు చేస్తారు ? కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి, శివధర్ రెడ్డిపై కేసు బుక్ చేయాల్సిందే.. FIR నమోదు చేయాల్సిందే అని ఎక్స్ వేదికగా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు వేయడం వల్లనే రాష్ట్రంలో భూకంపం వచ్చింది.సీఎం పాపాల నుంచి ప్రజలను దేవుళ్లే కాపాడాలంటూ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+