పెళ్ళి చేసుకొంటానని మోసం చేసిన ఎస్ ఐ పై కేసు నమోదు
పెళ్ళి చేసుకొంటానని మోసం చేసిన ఎస్ ఐ పై కేసు నమోదైంది.అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ ఎస్ ఐ పనిచేస్తున్న మహంకాళి ప్రకాష్ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తాళ్ళ సింగారం గ్రామానికి చెందిన స్వప్న
చౌటుప్పల్:పెళ్ళి చేసుకొంటానని కట్నకానుకలు మాట్లాడుకొని నిశ్చితార్థం చేసుకొన్న ఎస్ .ఐ. చివరకు పెళ్ళికి ముహుర్తాలు పెట్టుకొనేందుకు సాకులు చూపుతూ వాయిదా వేశాడు.దీంతో అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎస్.ఐ.పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో చోటుచేసుకొంది.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు చెందిన మహంకాళి ప్రకాష్(30) సికింద్రాబాద్ పరిధిలోని అల్వాట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్నాడు.అయితే ప్రకాష్ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తాళ్ళ సింగారం గ్రామంలో ఓ అమ్మాయిని వివాహం చేసుకోవాలని భావించాడు.
గత ఏడాది డిసెంబర్ 1వ, తేదిన చౌటుప్పల్ మండలంలోని తాళ్ళ సింగారం గ్రామానికి చెందిన సుక్క ముత్యాలు కూతురు స్వప్న(22) తో పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు.అమ్మాయిని నచ్చిన రెండు కుటుంబాలు కట్న కానుకలు కూడ మాట్లాడుకొన్నారు.కట్నం కింద రూ.20 లక్షలను ఇచ్చేందుకు అమ్మాయి తండ్రి కూడ ఒప్పుకొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి మాసంలో వివాహం జరిపించాలని నిర్ణయించుకొన్నారు.అయితే ప్రకాష్ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.స్వప్నను వివాహం చేసుకోలేనని ప్రకాష్ అమ్మాయి కుటుంబసభ్యులకు సమాచారం పంపారు.
పొంతన లేని సమాధానాలను చెప్పడంతో అమ్మాయి కుటుంబసభ్యులు ప్రకాష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొంత కాలం పాటు అమ్మాయి నచ్చలేదని, మరికొంతకాలం తన అక్కాచెల్లెళ్ళకు అమ్మాయి నచ్చలేదని సమాధానం చెప్పారని బాదిత కుటుంబం ఆరోపిస్తోంది.బంధువులతో మాట్లాడించారు ప్రకాష్ తీరులో మార్పురాలేదు.
పోలీసుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించారు .అయినా ఆయన తీరులో మార్పురాలేదు.దీంతో ముత్యాలు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో ప్రకాష్ పై ఫిర్యాదు చేశాడు.దీంతో ప్రకాష్ పై 420 కేసు నమోదు చేసినట్టు చౌటుప్పల్ సిఐ నవీన్ కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications