రెండో రోజు సండ్ర విచారణ: నిన్న సెబాస్టియన్‌తో ముఖాముఖి, జనార్దన్‌పై ఆరా
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు విచారణ ప్రారంభించారు. సాయంత్రం 4.30 గంటల వరకు విచారణ కొనసాగనుంది. విచారణ ముగిసిన అనంతరం సండ్రను ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు సండ్రను తరలించనున్నారు. ఓటుకు నోటు కేసులో కీలక విషయాలను సండ్ర నుంచి అధికారులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా గురువారంనాడు సండ్రను ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే.
మొదటి రోజు విచారణలో భాగంగా సండ్రను తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఎసిబి అధికారులు సెబాస్టియన్‌తో మాట్లాడిన రికార్డులను చూపిస్తాం అప్పుడేమంటారని అడిగినట్లు తెలుస్తోంది. తమ వద్ద కాల్ డాటా ఉందని, పైగా సండ్ర మాట్లాడిన ప్రతి కాల్‌ను పూర్తిగా సెబాస్టియన్ రికార్డు చేశారని, ఈ డీల్‌లో మాట్లాడినవారి అందరి కాల్‌రికార్డ్స్ సెబాస్టియన్ ఫోన్‌లో రికార్డయి ఉన్నాయని ఏసీబీ అధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ సమయంలో పదినిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారని సమాచారం.

సెబాస్టియన్‌తో మాట్లాడే సమయంలో జనార్దన్ సార్‌కు నేను చెప్తాలే అని సండ్ర పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ జనార్దన్ అనే వ్యక్తి ఎవరంటూ పదేపదే ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే ఏం చెప్పాలో తెలియక తికమక పడ్డాడని అధికారులు తెలిపారు. కస్టడీ సమయం ముగిసిన వెంటనే గురువారం సాయంత్రం సండ్రకు ఉస్మానియాలో వైద్యచికిత్సలు చేయించి అక్కడి నుంచి బస నిమిత్తం సిట్ కార్యాలయానికి తరలించారు.
సండ్ర విచారణ సమయంలో సెబాస్టియన్‌ను సండ్ర ఎదుట కూర్చోబెట్టి ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో ఏం మాట్లాడాలో తెలియక సండ్ర కలవరానికి గురయ్యారని అంటున్నారు. మొదటి నుంచి మీరిద్దరే వ్యూహం నడిపించారు.. ఇందులో అసలు కుట్రదారుడు ఎవరు? మీ ఫోన్ సంభాషణ నిజమైందే కదా! అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
అయితే తన ఫోన్‌నుంచి సండ్రకు కాల్ చేసింది నిజమేనని తమ ఎదుట సెబాస్టియన్ ఒప్పుకున్నట్టు ఏసీబీలోని ఓ కీలకఅధికారి వెల్లడించారు. సెబాస్టియన్ గురువారంనాడు మీడియాపై చిర్రుబుర్రులాడి కొన్ని వ్యాఖ్యలు చేయడానికి కారణం అదేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications