ఎల్లుండి నుంచే జీహెచ్ఎంసీలో నగదు రహిత లావాదేవీలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జీహెచ్ఎంసీ నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు సిద్ధమవుతోంది. ప్రజల నుంచి స్వీకరించే పన్నులు, బిల్లులను కూడా ఆన్‌లైన్ పేమెంట్లేగాక, స్వైపింగ్ మిషన్ల ద్వారా సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందు కోసం నగరంలోని బిల్ కలెక్టర్లకు స్వైపింగ్ మిషిన్లను అందజేయనున్నట్లు తెలిసింది.

మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, భవన అనుమతులు, తదితర లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారానే చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించిన జీహెచ్ఎంసీ యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలను నిర్వహించనుంది.

Cashless transactions in GHMC soon

అంతేగాక, క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి స్వైపింగ్ మిషిన్ల ద్వారా ప్రజల నుంచి బిల్లులు స్వీకరించనుంది. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. నగదు రహిత లావాదేవీలు పెరగాల్సిన అవసరం ఉందని చెప్పిన విషయం తెలిసిందే.

కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ నగదు రహిత లావాదేవీలను పెంచుతామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఇందు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించేందుకు ఐటీ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఎల్లుండి నుంచి నగదు రహిత లావాదేవీలను ప్రారంభించనున్నట్లు కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
GHMC commissioner B Janardhan Reddy on Tuesday said that cashless transactions in GHMC soon.
Please Wait while comments are loading...