ఒక్కొక్కరుగా బయటకు - చీకోటి లిస్టులో : మరి కొందరికి నోటీసులు..!!
క్యాసినో నిర్వహకుడు చీకోటీ ప్రవీణ్ వ్యవహారంలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈడీ సోదాలు పూర్తి చేయటంతో పాటుగా కీలక సమాచారం సేకరించింది. మనీ లాండరింగ్ జరిగినట్లుగా చెబుతున్నారు. దర్యాప్తులో భాగంగా విచారణకు రావాలంటూ ఈడీ ఇప్పటికే ప్రవీణ్ తో పాటుగా మాధవ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. తాజాగా.. విమానాల ఆపరేటర్ సంపత్ సహా మరో నలుగురు హవాలా ఏజెంట్లకు నోటీసులు జారీ అయ్యాయి.

ఈడీ వద్ద కీలక సమాచారం
ప్రవీణ్ తో పాటుగా మాధవరెడ్డి ల్యాప్ టాప్.. మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు వారి బ్యాంకు లావాదేవీలపైన ఫోకస్ పెట్టారు. కీలక సమాచారం సేకరించిన ఈడీ అధికారులు విచారణలో వారికి కావాల్సిన సమాచారం మరింతగా రాబట్టే అవకాశం ఉంది. పలువురు రాజకీయ నాయకులు, అధికారులకు సైతం ప్రవీణ్, మాధవరెడ్డి ఖాతాల నుంచి నగదు బదిలీ చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. గోవా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్‌లో ప్రవీణ్ మాధవరెడ్డి క్యాసినో ఈవెంట్లు నిర్వహించారు.

మొత్తం ఏడుగురికి నోటీసులు
హవాలా మార్గంలో డబ్బులను ఇక్కడి నుంచి తీసుకెళ్లి తిరిగి ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఈడీ అధికారులు నిర్దారణకు వచ్చారని చెబుతున్నారు. తమ వ్యాపారం కోసం హవాలా ఏజెంట్ల సహకారం తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఫెమా నిబంధనలను ఉల్లఘించిన అంశంలో ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. సోమవారం నుంచి ఈ ఇద్దరి విచారణ ప్రారంభం కానుంది. మరోవైపు చీకోటి ఫాం హౌస్ లో అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేసారు.

లింకులపై విచారణ.. ఆధారాల సేకరణ
చీకోటి ఈ నెల 8వ తేదీ నుంచి గత వారం మధ్య పలు మార్లు ఇతర దేశాల్లో క్యాసినో నిర్వహించినట్లుగా సమాచారం. ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మందిని క్యాసినోకు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో ఈడీ సోదాలు నిర్వహించిన సమయంలోనూ భారీగా నగదు దొరికినట్లుగా చెబుతున్నారు. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం జప్తు చేసారని సమాచారం. ఏడు నెలల కాలంలో ఏడు దేశాల్లో క్యాసినో నిర్వహించారని గుర్తించారు. దీంతో..ఇక, విచారణ సమయంలో మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications