ఓటేశారు.. చింతమడకలో కేసీఆర్ , బంజారా హిల్స్ లో కేటీఆర్ , సోమాజీ గూడాలో నరసింహన్

దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది . అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో భద్రపరుస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. ఇక తెలంగాణలో పోలింగ్ చాలా మందకొడిగా సాగుతుంది. ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగలేదు. చాలా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది .

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన రెండోసారి సీఎం అయిన తర్వాత సొంత ఊరు చింతమడకకు తొలిసారి తన ఓటుహక్కు వినియోగించుకునేందుకు వెళ్ళారు .హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో చింతమడక చేరుకున్న కేసీఆర్ దంపతులు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓట్లను వేశారు .

Cast vote .. CM KCR in Chintamadaka , KTR in Banjara hills , Narasimhan in Somajiguda


ఇక కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బంజారాహిల్స్‌ నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాలులో తన భార్య శైలమతో కలిసి ఓటుహక్కు వినియోగించుకుంటారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు ఉదయం 9 గంటలకు సోమాజీగూడ ఎంఎస్‌ మక్తాలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+