కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ కేసు పెట్టలేదు, ఎందుకు?: ’మేడారం‘ జాతీయ పండగ అంటూ రాహుల్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.

2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చింది.. ఆ హామీ నిలబెట్టుకుందన్నారు. సాధారణంగా తమకు నష్టం కలిగించే నిర్ణయాలు పార్టీలు తీసుకోవని.. కానీ, కాంగ్రెస్ మాత్రం తనకు నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిందన్నారు రాహుల్. కేసీఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. మూడెకరాల భూమి, రైతు రుణమాఫీ.. ఇలా ఏ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.

CBI, ED files no case on KCR, why: Rahul Gandhi slams kcr and modi

రాజస్థాన్‌లో ఆరోగ్య పథకం ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోంది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఛత్తీస్‌గఢ్‌లో వారి ధాన్యాన్ని అధిక ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వరి ధాన్యానికి ఛత్తీస్‌గఢ్‌లో ఎక్కివ ధర చెల్లించి కొంటున్నారు. కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేసి చూపింది. రాష్ట్రంలో పోడు, అసైన్డ్ భూముల విషయంలో అందరికీ న్యాయం చేస్తామన్నారు రాహుల్ గాంధీ.

CBI, ED files no case on KCR, why: Rahul Gandhi slams kcr and modi

తెలంగాణలోనూ మేం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపుతామని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తామన్నారు. తెలంగాణలో బీఆరెస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ అని అన్నారు. తెలంగాణలో బీఆరెస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందన్నారు.వీరికి ఎంఐఎం మద్దతు ఇస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈ మూడు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందన్నారు రాహుల్.

'సీబీఐ, ఈడీలు.. దేశంలోని విపక్ష నేతలందరిపైనా కేసులు పెట్టినా... కేసీఆర్‌పై ఒక్కకేసు పెట్టలేదు.. ఎందుకు అని ప్రశ్నించారు రాహుల్.
బీఆర్ఎస్‌కు ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్టేనని అన్నారు. దేశంలో బీజేపీపై మేము యుద్ధం చేస్తున్నాం. అందుకే కాంగ్రెస్‌కు మద్దతు తెలపండి. బీజేపీని, బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్‌ను కూడా ఓడించండి అని ప్రజలకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+