Farm House Case: ఫాంహౌస్ కేసు వివరాలు ఇవ్వాలని మరోసారి లేఖ రాసిన సీబీఐ..
ఫాంహౌస్ కేసు వివరాలు ఇవ్వాలని సీబీఐ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారికి మరోసారి లేఖ రాసింది.
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో వివరాలు ఇవ్వాలని సీబీఐ రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ మరోసారి లేఖ రాసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంబంధించి ఫైళ్లు ఇవ్వాలని సీబీఐ తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంత కుమారికి లేఖ రాసింది. వివరాలు ఇవ్వాలని సీబీఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఐదుసార్లు లేఖ రాసింది. హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించడంతో వివరాల కోసం సీబీఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తోంది.
2022 అక్టోబర్ 26వ తేదీన మొయినాబాద్ ఫాంహౌస్ లో తమను ప్రలోభాలకు గురి చేశారంటూ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయా జీ, నందకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయా జీ, నందకుమార్ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పైలెట్ రోహిత్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. కేసును సీబీఐకు అప్పగించొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అయితే డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పింది. దీంతో ప్రభుత్వం మరోసారి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేసింది.












Click it and Unblock the Notifications