ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..!!
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏ1 గా ప్రభాకర్ రావు ఏ6గా శ్రవణ్ ఉన్నారు. వీరి పైన తాజాగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేఖ రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సీబీఐ అంగీకరించింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి.
రెడ్ కార్నర్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావుపై కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ప్రభాకర్‌రావు వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత అమెరికాకు ప్రభాకర్ రావు వెళ్లిపోయారు. తన అనారోగ్య కారణాలతో ఉన్నట్లుగా చెబుతూ వచ్చారు. ఆయన్ను ఇండియాకు రప్పించేందుకు సీఐడీ ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. ముందుగా ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది.

విచారణకు వస్తే
రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన విషయాన్ని సీబీఐకి సీఐడీ అధికారులు తెలిపారు. సీబీఐ నుంచి ఇంటర్ పోల్‌కి సీఐడీ అధికారులు సమాచారం అందజేశారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు సీఐడీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రభాకర్ రావుపైన నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ప్రభాకర్ రావుని హాజరుపరచాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆదేశించింది. కానీ, ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని సిట్‌కు ప్రభాకర్ రావు తెలిపారు.
సిట్ అధికారుల ప్రయత్నం
ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావుని హైదరాబాద్‌కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నారు. ఫోన్ ట్యా పింగ్ కేసులో ఏ 6గా ఉన్న శ్రవణ్ రావు పైన కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. శ్రవణ్ రావ్ ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రభాకర్ రావు శ్రవణ్ రావులని హైదరాబాద్‌కు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని సిట్ అధికారులు చెబుతున్నారు. ప్రభాకర్ రావు ఒకవేళ విచారణకు హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications