సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్ పీఎం భార్గవ కన్నుమూత
సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పీఎం భార్గవ కన్ను మూశారు. ఆయన వయస్సు ప్రస్తుతం 89 సంవత్పరాలు.
హైదరాబాద్: సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పీఎం భార్గవ కన్ను మూశారు. ఆయన వయస్సు ప్రస్తుతం 89 సంవత్పరాలు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాసంలో పార్థివ దేహం ఉంచారు. భార్గవకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

1928 ఫిబ్రవరి 22న రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జన్మించిన ఆయన 21 ఏళ్లకే సింథటిక్ ఆర్గానిక్ కెమెస్ట్రీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గానూ పనిచేశారు.
భార్గవ అందించిన సేవలకు గాను 1986లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అయితే ఈ పురస్కారాన్ని భార్గవ 2015లో తిరిగి వెనక్కి ఇచ్చేశారు.












Click it and Unblock the Notifications