రేవంత్ సర్కార్ ఏడాది పాలన-గూస్ బంప్స్ తెప్పించే వీడియో సాంగ్ రిలీజ్..!!
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు కూడా క్రమంగా అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం చూరగొంది. ముఖ్యంగా మహిళా సాధికారతపై దృష్టి సారించిన రేవంత్ సర్కార్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు లాంటి చాలా పథకాలు అమలు చేస్తున్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి చెప్పారు.డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్, లక్షమంది మహిళలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వారిని ఆహ్వానించారు.
ఇక ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, ప్రారంభిస్తున్న పథకాలు, అమలు చేస్తున్న పథకాల్లో పూర్తి పారదర్శకత కనిపిస్తుంది. ఈ పథకాలన్నీ ప్రజలకు తెలపడంలో టీపీసీసీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున కష్టపడుతోంది. ప్రతి పథకం ప్రజలకు వివరించడంలో సోషల్ మీడియా సక్సెస్ అవుతోంది. అదే సమయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సైతం ధీటుగా తిప్పికొడుతోంది. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా మన్నె సతీష్, జంగా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బలోపేతంగా తయారవుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ఎవరికే సమస్య వచ్చిన సోషల్ మీడియా ద్వారా చెబితే వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెబుతున్నారు.

రేవంత్ పాలనపై స్పెషల్ సాంగ్
ఇక తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో టీపీసీసీ సోషల్ మీడియా సెక్రటరీ జంగా శ్రీనివాస్ స్వయంగా రాసిన పాటను విడుదల చేశారు. "మార్పుతోని తెలంగాణ వెలుగుతున్నది..దొరలపాలన నుంచి విముక్తైనది..రేవంతన్న పరిపాలన సాగుతున్నది.. ప్రజల పక్షమై ముందుకు కదులుతున్నది" అంటూ సాగే పాట ప్రస్తుతం కాంగ్రెస్ హ్యాండిల్స్‌లో వైరల్ అవుతోంది. ఈ పాటలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చక్కగా వివరించారు. లిరిక్స్ అద్భుతం అంటూ ఇటు సామాన్య ప్రజలు అటు పార్టీ కార్యకర్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం 4 నిమిషాల 25 సెకన్ల నిడివి ఉన్న ఈ గీతం వింటుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయంటూ కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ అభిమానులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ప్రత్యేకంగా స్వరపరిచిన ఈ గీతం అద్భుతంగా ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా టీపీసీసీ సోషల్ మీడియా సెక్రటరీ జంగా శ్రీనివాస్‌ను అభినందించారు. ఇక గత కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ఎలాంటి అణిచివేతకు గురైందో గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications