వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మజ్లిస్ కు బీజేపీ భయపడదు-2024 లో అధికారం ఖాయం : ఈటలను గెలపించాలి-అమిత్ షా పిలుపు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

మజ్లిస్ కు బీజేపీ భయపడదని..మత పరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేసారు. నిర్మల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొన్నారు.
తెలంగాణలో 2024లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని పేర్కొన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన రోజు అని అమిత్‌ షా అన్నారు.

Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)

కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు

కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమ రోజుల్లో కేసీఆర్ డిమాండ్ చేశారని అమిత్ షా గుర్తు చేసారు. మరిప్పుడు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. విమోచనోత్సవాన్ని కేసీఆర్ ఇపుడు మరిచిపోయారన్నారు. ఎంఐఎంతో బీజేపీ మాత్రమే పోరాడగలదని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఇవాళ ప్రధాని మోడీ పుట్టిన రోజని..ఈ సందర్భంగా రెండు కోట్ల వ్యాక్సిన్ల డోస్‌ను ఇస్తున్నామని ఆయన తెలిపారు. సర్దార్ పటేల్ పరాక్రమంతోనే 13 నెలల తరువాత భారత్‌లో తెలంగాణ కలిసిందన్నారు.

2023 లో తెలంగాణలో అధికారం బీజేపీదే

2023 లో తెలంగాణలో అధికారం బీజేపీదే


తెలంగాణ విమోచన దినోత్సవం జరుతున్నామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయంటూ షా ప్రశ్నించారు. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్ కు పట్టవా అని నిలదీసారు. తెలంగాణలో ఆదీవాసీలు..ఎస్సీల కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలిచిందని..20023 ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని సీట్లలో పార్టీ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తంచేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్‌ను అమిత్ షా ప్రశంసలతో ముంచెత్తారు.

సంజయ్ - రాజేందర్ కు అభినందనలు

సంజయ్ - రాజేందర్ కు అభినందనలు

తెలంగాణలోని సమస్యలు తెలుసుకునేందుకే బండి పాదయాత్ర చేస్తున్నారని ఆయన కొనియాడారు. తెలంగాణ నుంచి తొలి సారి కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డిని ప్రధాని ఎంపిక చేసారంటూ అమిత్ షా వివరించారు. సభ ప్రారంభం సమయంలో..అదే విధంగా తన ప్రసంగం సమయంలోనూ అమిత్ షా ఈటల రాజేందర్ ను ప్రత్యేకంగా అభినందించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌ను గెలిపించాలని ప్రజలను అమిత్ షా కోరారు. సభా ప్రాంగణం వద్ద అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

కిషన్ రెడ్డి పైన అమిత్ షా ప్రశంసలు

కిషన్ రెడ్డి పైన అమిత్ షా ప్రశంసలు


తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..సచివాలయానికి వచ్చే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపనందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేసారు. పటేల్ లేకుండా అసలు తెలంగాణ వచ్చేది కాదని..కేసీఆర్ సీఎం అయ్యే వారు కాదని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత అమిత్ షా కే దక్కుతుందన్నారు.

English summary
Cental Home minister confident that BJP will come in to power in Telangana in 2024 elections. He says Bjp only the party which fight against MIM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X