కేంద్రం రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుంది.. తగ్గేదేలే లేదంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్
నిజామాబాద్ రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు ఏర్పాటు జరిగింది. నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పసుపు బోర్డును వర్చువల్ గా ప్రారంభించారు. నిజామాబాద్ నుండి ఎంపీ ధర్మపురి అరవింద్ వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కార్యక్రమంలో వర్చువల్ గా కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు.
పసుపు బోర్డు ఏర్పాటుతో కేంద్ర మంత్రి బండి సంజయ్ హర్షం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. ధర్మపురి అరవింద్ రాతపూర్వకంగా హామీ ఇచ్చి మరీ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పసుపు బోర్డును ఏర్పాటు చేయించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు.

పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు ప్రయోజనాలు
పసుపు బోర్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి పీయూష్ గోయల్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. పసుపు బోర్డు కార్యాలయ ఏర్పాటుతో నిజామాబాద్ రైతులకు నిజంగానే నేడు పండుగ రోజు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల ఈ ప్రాంత రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి అన్నారు.
పసుపు బోర్డుకు కేంద్రం ప్రత్యేక నిధులు ఇచ్చే అవకాశం
పసుపు రైతులకు గిట్టుబాటు సమస్య ఉండబోదని, పసుపు బోర్డుకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉందని బండి సంజయ్ తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం పోరాటం చేసి సాధించిన పసుపు రైతులు అందరికీ హాట్సాఫ్ అని బండి సంజయ్ ప్రకటించారు. పసుపు బోర్డు రైతు ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసి వాటిని ప్రత్యేక స్టోరేజీలలో ఉంచుతుందని పేర్కొన్నారు.
పసుపు బోర్డు వల్ల రైతులకు ఈ బెనిఫిట్స్
బ్రాండింగ్, ప్రమోషన్ స్కీమ్స్, ప్యాకింగ్ తో పాటు జాతీయంగా, అంతర్జాతీయంగా ఎగుమతులు చేసే అవకాశం ఉంటుందని బండి సంజయ్ తెలిపారు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే రైతులు నష్టపోకుండా పంట బీమా కూడా ఉంటుందని అన్నారు. ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేస్తుందని, క్వాలిటీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి నిరంతరం క్వాలిటీ చెక్ చేస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.












Click it and Unblock the Notifications