Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రం,రాష్ట్రం రాక్షస క్రీడ.!బలవుతున్న రైతులు.!వరిధాన్యం అంశంలో రేవంత్,ఉత్తమ్,మధు యాష్కీ ఫైర్.!

ఢిల్లీ/హైదరాబాద్ : గత రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాక్షస క్రీడలో అమాయక రైతులు బలి అవుతున్నారరి, ఢిల్లీ వేదికగా బిజెపి, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజల పరువు తీస్తున్నారని ఎం.పీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం చంద్రశేఖర్ రావు కుటుంబం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించాలని అమిత్ షా బుదవారం బీజేపీ నేతలకు సూచించారని అన్నారు. తన దగ్గర అన్ని వివరాలు ఉన్నాయన్న అమిత్ షా చంద్రశేఖర్ రావు కుటుంబ అవినీతి పై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని సూటిగా ప్రశ్నించారు.

 బదులుకొని మరీ డ్రామాలు..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి ధ్వజం

బదులుకొని మరీ డ్రామాలు..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి ధ్వజం

బిజెపి, టీఆర్ఎస్ కు మధ్య ఉన్న అనుబంధం, ఒప్పందం బహిర్గతం చేయాలని డిమాండ్ చేసారు. తెలంగాణ సమాజాన్ని బిజెపి, టీఆర్ఎస్ రెండు కలసి మోసం చేస్తున్నాయిని, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారని, తెలంగాణలో చాలదు అన్నట్లు టీఆర్ఎస్, బిజెపి నేతలు ఢిల్లీలో వీధి నాటకాలు మొదలు పెట్టారని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. రబీ సీజన్ లో పండిన పంట కొనుగోలు చేసే అంశంపై మాట్లాడకుండా మళ్లీ వర్షా కాలంలో పండే పంట గురించి తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారని, రాజకీయ వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందడం తప్ప చంద్రశేఖర్ రావు మరే ప్రయత్నం చేయడం లేదని రేవంత్ మండిపడ్డారు.

 అమిత్ షా డైరెక్షన్ లో కేసీఆర్.. తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి

అమిత్ షా డైరెక్షన్ లో కేసీఆర్.. తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్, బిజెపి నేతలు వీధి బాగోతాలు ఆడుతున్నారని, కాంగ్రెస్ కు ప్రజల్లో ఉన్న ఆదరణను పక్కదోవ పట్టించేందుకు ఈ నాటకాలకు తెరతీసారని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. వరి ధాన్యం కొనుగోలు అంశంపై అమిత్ షా డైరెక్షన్ లో చంద్రశేఖర్ రావు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని, చంద్రశేఖర్ రావు తన వ్యూహాల మీద నమ్మకం కోల్పోయి, సునీల్ అనే రాజకీయ వ్యూహకర్త డైరెక్షన్ లో నడుస్తున్నారని రేవంత్ విమర్శించారు. సునీల్ అనే వ్యూహకర్త బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు నాయకుడిగా మారాడని, త్వరలో అన్ని అంశాలను వివరిస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పై సీబీఐతో విచారణ జరిపించాలి.. డిమాండ్ చేసిన ఉత్తమ్

టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పై సీబీఐతో విచారణ జరిపించాలి.. డిమాండ్ చేసిన ఉత్తమ్

గత సంవత్సరం రబీలో 52 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే, ఈ రబీలో వరి సాగు చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలు ఇంటెన్సివ్ గా ప్రకటిస్తే, ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యం ఎగుమతి చేయవచ్చని ఎం.పీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి బాగోతం అందరికీ తెలుసని, అయినా కేంద్రప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఉత్తమ్ నిలదీసారు. బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పై సీవీసీ, సీబీఐతో విచారణ జరిపించాలని, తెలంగాణ ఎస్టీ రిజర్వేషన్ ల పెంపు పై కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రతిపాదన అందలేదని తన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారని అన్నారు. దీన్నిబట్టి గిరిజనులపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేసారు.

 మిల్లర్ల 18వేల కోట్ల కుంభకోణం.. మండిపడ్డ టీపీసీసీ ప్రచార కిమటీ ఛైర్మన్ మధు యాష్కీ..

మిల్లర్ల 18వేల కోట్ల కుంభకోణం.. మండిపడ్డ టీపీసీసీ ప్రచార కిమటీ ఛైర్మన్ మధు యాష్కీ..

కొనుగోలు కేంద్రాలు లేక, అకాల వర్షంతో రైతులు 1300, 1400 రూపాయలకే వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లుకు అమ్ముకున్నారని, అంటే 1940 రూపాయలు ఉన్న కనీస మద్దతు ధర కూడా రైతులకు అందలేదని టీపీసీసీ ప్రచార కిమటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ విచారం వ్యక్తం చేసారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది, ఈ ధాన్యం మొత్తాన్ని రైస్ మిల్లర్లనుంచి ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు తెలుస్తోందని అన్నారు. రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కనీస మద్దతు ధర 1940రూయలతో కొనుగోలు చేసిందని, రైస్ మిల్లర్లు మాత్రం రైతులను మోసం చేసి మూడు, నాలుగు వందల రూపాయాల తక్కువ ధరకు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం 18 వేల కోట్ల కుంభకోణం జరిగిందని మధు యాష్కీ వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+