మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం: కీలక అంశాల పరిశీలన, త్వరలో నివేదిక

భూపాలపల్లి: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. మంగళవారం బ్యారేజీని పరిశీలించింది. 20వ పిల్లర్ వద్ద పగుళ్లకు గల కారణాలతో పాటు బ్యారేజీ పటిష్ఠత, జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేసింది.

సమగ్ర పరిశీలన తర్వాత కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, ఎల్ అండ్ టీ ప్రతినిధులు.. కేంద్ర బృందంతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై విపక్షాలు విమర్శలు చేస్తున్న క్రమంలో.. కమిటీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Central Experts Team Inspected Medigadda Barrage in Kaleshwaram project

కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ(Medigadda Lakshmi Barrage)పై వంతెనను మంగళవారం కేంద్ర బృందం సందర్శించింది. మేడిగడ్డ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర జల్ శక్తి శాఖ.. వెంటనే ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృతంలోని ఈ ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డకు వచ్చి వంతెన కుంగుబాటును ప్రత్యక్షంగా పరిశీలించారు.

ప్రాజెక్టు ఈఎన్​సీ, ఈఈ ఇతర అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు.. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులకు కుంగుబాటుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించారు. నిపుణుల బృందం బ్యారేజీని పరిశీలించి కుంగుబాటు ఏ మేరకు జరిగిందనే విషయంపై అవగాహనకు వచ్చారు. పగుళ్లు వల్ల వంతెన పటిష్ఠత తదితర అంశాలపై వివరాలు సేకరించి కేంద్రానికి నివేదిక అందించనున్నారు.

కాగా, గత శనివారం రాత్రి భారీ శబ్దంతో మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. దీంతో 7వ బ్లాక్​లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన గేట్లు ఎత్తి.. జలాశంయలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నీటిమట్టం కనిష్ఠస్థాయికి చేరడం వల్ల పగుళ్లు స్పష్టంగా కనపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక పిల్లరు కుంగుబాటుకు గురి కాగా.. రెండు వైపులా ఉండే పిల్లర్లపైనా ఆ ప్రభావం పడినట్టు తెలుస్తోంది.

కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై విపక్షాల విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పటిష్ఠ భద్రత కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పిల్లర్‌ కుంగుబాటుతో తెలంగాణ- మహారాష్ట్రకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్టు వైపు ప్రజలను ఎవరినీ రానీయడం లేదు. భద్రత కోసమే ప్రజలను అటువైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+