ఈటలకు కేంద్ర బలగాలతో భద్రత - హత్యకు కుట్ర..!!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి..బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేసారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇందుకోసం రూ 20 కోట్ల సుపారీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈటల సతీమణి జమున ఇవే ఆరోపణలు చేయటం కలకలంగా మారాయి. ఇదే సమయంలో ఈటెల కు కేంద్ర బలగాలతో భద్రతకు నిర్ణయించింది.
ఈటల సంచలన ఆరోపణలు
బీజేపీ నేత ఈటల రాజేందర తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనను చంపేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కుట్ర పన్నారంటూ తన సతీమణి జమున చెప్పిన విషయం వాస్తవమేనన్నారు. ప్రగతిభవన్ స్కెచ్ ప్రకారమే హుజూరాబాద్ నియోజకవర్గంలో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఇక బీజేపీలో తానేమీ అసంతృప్తితో లేనని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నుంచి తనను బయటికి పంపించినప్పుడు బీజేపీ అక్కున చేర్చుకుందన్నారు. అయితే తాను పార్టీ వదలివెళ్లాలని కొంతమంది కోరుకున్నారని చెప్పారు. పార్టీ అన్నప్పుడు భేదాభిప్రాయాలు సహజమని అన్నారు. అయినా.. పార్టీ మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు. అధిష్ఠానం పిలిస్తేనే ఢిల్లీకి వెళ్లానని, ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.
కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారు
అంతకు ముందు తన భర్త రాజేందర్‌ను హత్య చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఈటల జమున ఆరోపించారు. రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానంటూ కౌశిక్‌రెడ్డి తన సన్నిహితులతో అన్నట్లు తెలిసిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై దాడులు చేసిన చరిత్ర కౌశిక్‌రెడ్డిదని చెప్పుకొచ్చారు.

అమరవీరుల స్తూపంపై రాజేందర్ పేరు ఉన్నందునే దానిని కూల్చివేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు ఈటలపై ఉన్నన కోపంతో కౌశిక్‌రెడ్డిని హుజూరాబాద్ ప్రజలపై ఉసిగొల్పుతున్నారని జమున తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డి అరాచకాలకు అంతేలేకుండా పోతోందన్నారు. గతంలో గవర్నర్‌పైనే అనుచిత వ్యాఖ్యలు చేసినా కౌశిక్‌రెడ్డిని సీఎం కనీసం మందలించలేదని విమర్శించారు.
కేంద్ర బలగాలతో భద్రత
ఈటెల హత్యకు కుట్ర ఆరోపణల వేళ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈటల రాజేందర్‌కు కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రత కేటాయించింది. 8 ప్లస్ 8 సిబ్బందితో ఆయనకు భద్రత కల్పించనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న 2 ప్లస్ 2 భద్రతకు ఇది అదనం అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
తన భర్త హత్యకు కుట్ర జరుగుతోందని జమున ఆరోపించటం.. ఆ తరువాత రాజేందర్ ఇదే విషయాన్ని నిర్దారిస్తూ మాట్లాడారు. ఆ తరువాత కొద్ది గంటల్లోనే ఈటెలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని బీజేపీ వర్గాలు నిర్దారించాయి. తాజాగా ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలతో సమావేశమైన సమయంలోనే ఈటల రాష్ట్రంలోని తాజా పరిస్థితుల పైన వివరించినట్లు వెల్లడించారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications