రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. పడనివారు ఈకేవైసీ చేయించుకోండి
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తను వినిపించింది. దీనివల్ల చాలామంది అన్నదాతలకు ఊరట కలగనుంది. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా తెలంగాణలోని రైతులకు ఈ అవకాశం కలగనుంది. వ్యవసాయానికి సౌరవిద్యుత్తును ఈ పథకంద్వారా అందించనున్నారు. 20 వేల వ్యవసాయ మోటార్ల కోసం ప్రయోగాత్మకంగా సోలార్ పానెళ్ల ను ఏర్పాటు చేస్తారు. వీటికి సంబంధించి రాయితీ అందించనున్నారు.
సౌర ఫలకాల ఏర్పాటుకు దాదాపు రూ.2.5 లక్షలు ఖర్చవుతుంది. అందులో రూ.75 వేలను రాయితీగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. రైతుల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత రాయితీని ఇవ్వాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది. ఇది అన్నదాతలకు బాగా కలిసిరానుంది. విద్యుత్తు భారం కూడా చాలావరకు తగ్గిపోతుంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్రం ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది. 16వ విడత డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో పడ్డాయి. ప్రతి రైతుకు రూ. 32 వేల వరకు వచ్చాయి.

ఇంకా రాని రైతులు 155261 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలి. లేదంటే 1800 1155 26 నెంబర్‌కు కూడా ఫోన్ చేయొచ్చు. 011 23381092 నెంబర్ లో కూడా మాట్లాడొచ్చు. ఈమెయిల్ కూడా చేయొచ్చు. [email protected]కు మెయిల్ పంపొచ్చు. రైతులు ఇంకా ఈకేవైసీ పూర్తిచేయకపోతే వెంటనే పూర్తిచేయాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు లేదంటే కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటితోపాటు పీఎం సూర్యఘర్ పథకాన్ని కూడా కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటిపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకొని వాటినుంచి వచ్చే విద్యుత్తును డిస్కంల్ కు అమ్ముకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. రాయితీ సౌకర్యాన్ని కూడా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications