రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!!

ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోక్ సభ.. అసెంబ్లీ సీట్లు 50 శాతం మేర పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్లు సైతం అమలు చేయాలని భావిస్తోంది. కాగా, తాజాగా జమిలి ఎన్నికల బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సిద్దం అవుతోంది. ఈ భారీ మార్పులతో 2029 ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ నిర్ణయాలు రేవంత్ కు ఒక విధంగా వరంగా మారుతున్నాయి. 2028 తరువాత సీఎంగా కొనసాగేందుకు అవకాశం కనిపిస్తోంది.

2029 ఎన్నికలు భారీ మార్పులతో నిర్వహించేలా కేంద్రం మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తోంది. 2029 ఎన్నికల్లో జమిలి అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. దీంతో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029 జూన్‌లో జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా చెబుతున్నారు. మరోవైపు రేవంత్‌ ప్రభుత్వ పదవీకాలం 2028 డిసెంబరులోనే ముగియనుంది. దీంతో ఆ ఆరు నెలలపాటు రాష్ట్రంలో ఏం జరగనుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జమిలి ఎన్నికలకు అనుగుణంగా అవసరమైన చోట్ల శాసనసభల కాలపరిమితి పెంపు లేదా తగ్గింపు పైన కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా బీజేపీ అగ్రనాయకత్వం ఆ పార్టీ ఎంపీలతో భేటీ వేళ జమిలి ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలిచ్చింది. కేంద్రం అనుకున్నది అనుకున్నట్లుగా అమలు చేస్తే.. జమిలి ఎన్నికల్లో మొదటి దశ 2029 జూన్‌ లేదా జూలైలో జరిగే అవకాశం ఉంది.

central-govt-planning-for-one-nation-one-election-in-2029-with-completion-of-delimitation-impact-on

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం కసరత్తు

కాగా, ప్రస్తుత మోదీ ప్రభుత్వ పదవీకాలం 2029 జూన్‌తో ముగియనుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి జమిలిగా నిర్వహించాలని కృతనిశ్చయంతో ఉన్నందునే నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ శాసనసభల పదవీకాలం జమిలికి ఆరు నెలల ముందే ముగియనున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2029 జూన్‌లో లోక్‌సభ ఎన్నికలతోపాటే జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ శాసనసభ కాలపరిమితిని కూడా పొడిగించాల్సి ఉంది. అందుకు వీలు కలిగించే రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రస్తుతం జేపీసీ పరిశీలనలో ఉన్నాయి. ఈ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీల కాలపరిమితి ముగిసే రాష్ట్రాల్లో మిగిలిన కాలానికి రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ కొత్త వాదనను బీజేపీ నేతలు వినిపిస్తున్నారు. అదే జరిగితే లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తెలంగాణ వంటి బలమైన రాష్ట్రం సహకారం లేకుండా పోతుంది. దీంతో.. తెలంగాణ అసెంబ్లీ కాల పరిమితి పెంచి .. 2029 లో ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+