Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!

కేంద్రం తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది. సుదీర్ఘ కాలంగా ప్రతిపాదనలకు పరిమితం అయిన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణీ కుల అవసరాలను తీరనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం ప్రయాణ ముఖ చిత్రమే మారిపోనుంది. ఇరు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన దిశగా తుది కసరత్తు జరుగుతోంది.

శ్రీశైలం ఘాట్ రోడ్డులో సుమారు 41 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ (ఆకాశ మార్గం) ప్రతిపాద నలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీని ద్వారా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులు.. పర్యాటకులకు రానున్న రోజుల్లో ప్రయాణం మరింత సులభతరం కావడమే కాకుండా, ప్రకృతి అందాలను సరికొత్త కోణంలో చూసే అవకాశం లభించనుంది. నల్లమల అడవుల గుండా సాగే ఈ ప్రయాణం లో వన్యప్రాణులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, పర్యావరణాన్ని కాపాడుతూనే ఈ భారీ ప్రాజెక్టును చేపట్టాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రమాదాల ముప్పు కూడా తప్పుతుంది. అడవికి పైన పిల్లర్లపై నిర్మించే ఈ రహదారి వల్ల కింద ఉండే జంతువుల సంచారానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డిజైన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక సర్వేలు పూర్తయ్యాయి.

 AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!!
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!!
central-govt-sanctioned-a-41-km-elevated-corridor-along-nh-765-enhancing-connectivity-to-srisailam

శ్రీశైలం భక్తులకు వెసులుబాటు

కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ నిర్మాణ బాధ్యతలను చేపడుతోంది. తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను అనుసంధానిస్తూ సాగే ఈ రహదారి వల్ల ఇరు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది. పర్యాటక రంగ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ కారిడార్‌పై వ్యూ పాయింట్లు, ఇతర వసతులను కూడా కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కేవలం రవాణా సౌకర్యమే కాకుండా, నల్లమల అటవీ ప్రాంత సౌందర్యాన్ని పర్యాటకులు ఆస్వాదించేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించడం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు ఎకో-టూరిజంకు కూడా భారీగా ఊతం లభిస్తుంది. త్వరలోనే ఈ నిర్మాణానికి సంబంధించిన పనులు పట్టాలెక్కనుంది. ఇందుకోసం రూ.18,500 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అధికారులు అంచనాలు వేశారు. ఇది అందుబాటులోకి వస్తే శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రయోజనం చేకూరనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+