అల్లు అర్జున్ అరెస్ట్ వెనక 'ఆ ఒక్కడు'

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ట్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి(35) అనే మహిళ మృతిచెందింది. ఆమె తొమ్మిది సంవత్సరాల కుమారుడు సాయితేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి సీరియస్ గానే ఉంది. థియేటర్ కు రావడానికి ముందు అల్లు అర్జున్ ముందస్తుగా పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఓపెన్ టాప్ జీపులో అభిమానులకు అభివాదం చేస్తూ రావడంతో అభిమానులంతా ఒక్కసారిగా తోసుకోవడంతో లోయర్ బాల్కనీలో తొక్కిసలాట జరిగింది.

రేవతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు
అల్లు అర్జున్ తోపాటు అతని టీం, పుష్ప2 టీం కూడా థియేటర్ కు వచ్చారు. రేవతి కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు భారత న్యాయ సంహిత చట్టాల కింద సెకన్లు 115, 11891), రెడ్ విత్ 3(1) పై కేసు నమోదైంది. అసలు పోలీసులకు అనుమతివ్వకుండా రావడం బన్నీ తప్పు. బెనిఫిట్ షో ఎన్ని గంటలకు ప్రదర్శించుకోవాలని ప్రభుత్వం చెప్పింది? వీరు ఎన్నిగంటలకు వేశారు? అది బెనిఫిట్ షోనా? ప్రీమియర్ షోనా? అసలు తప్పెవరిది? తదితర వివరాలపై సెంట్రల్ జోన్ డీసీసీ ఆకాన్ష్ యాదవ్ దర్యాప్తు చేశారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల్సి వస్తే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి తప్పు లేకుండా చూడటంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. జాతీయస్థాయిలో పేరున్న సెలబ్రిటీ కావడంతో చాలా లోతుగా దర్యాప్తు చేసి అల్లు అర్జున్ తప్పు ఉన్నట్లు తేల్చారు. వాస్తవానికి నాలుగురోజుల ముందే అరెస్ట్ చేసేవారుకానీ సినిమా పబ్లిసిటీ కోసం బన్నీ ఢిల్లీ వెళ్లారు.

Central Zone DCP akansh yadav investigates Allu Arjun s case in depth

ఢిల్లీ నుంచి తిరిగి రాగానే
ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే తీవ్రమైన ఒత్తిడి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఇతర మంత్రివర్గానికి తెలుసు. అలాగే ఆకాన్ష్ యాదవ్ కు తెలుసు. కానీ వారంతా బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులకే ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా కూల్చివేయించారు. తప్పు చేస్తే సెలబ్రిటీలైనా, సామాన్యులైనా ఒక్కటే అనే విషయాన్ని నిరూపించడానికే ఈ అరెస్ట్ జరిగినట్లుగా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+