Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో లెక్క తేలింది - అధికారికం..!!

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అందరూ ఎన్నికల ఫలితాల వైపే చూస్తున్నారు. పోలింగ్ శాతం గెలుపు ఓటమలను ప్రభావితం చేయనుంది. 2018 ఎన్నికల కంటే పోలింగ్ శాతం తగ్గింది. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో పోలింగ్ బాగానే నమోదు అయింది. రాష్ట్రంలో డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎగ్టిట్ పోల్స్ ఓటరు నాడి స్పష్టం చేసినా..తుది ఫలితాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.

రాష్ట్రంలో మొత్తం 70.74 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. 2018 ఎన్నికలతో పోలిస్తే 2023లో పోలింగ్‌ 3 శాతం తగ్గిందని చెప్పారు. 2018లో 73.37 శాతం పోలింగ్‌ నమోదైందని వెల్లడించారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఓట్లు ఎక్కవగా నమోదయ్యాయని చెప్పారు.ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 49 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని అన్నారు. ఈ ఎన్నికల్లో లక్షా 80 వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారని వికాస్‌ రాజ్‌ తెలిపారు.

CEO Announces 70.74 Voting Turn out in Telangana Asembly polls, Results on 3rd Decemebr

ఇక నియోజక వర్గాల వారీగా చూస్తే మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకుత్‌పురాలో 39.6 శాతం పోలింగ్‌ నమోదైందని వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. చాలా చోట్ల రాత్రి 9.30 వరకు పోలింగ్‌ జరిగిందని తెలిపారు. ఆదివారం ఉదయం 8.00 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెకిస్తారని, ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఈసారి ఓటర్లలో 18, 19 ఏండ్ల వయసున్న వారు 3.06 శాతం ఉన్నారన్నారు. ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ మంచి ఫలితాలను ఇచ్చిందని, 80 ఏండ్లు పైబడిన వారికి ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించామని అన్నారు.

రాష్ట్రంలో రీపోలింగ్‌కు అవకాశం లేదని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం, హైదరాబాద్‌లో అత్యల్పంగా 46.56 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెల్లడైనా ఇంకా తుది ఫలితం పైన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ తమదే విజయమని చెబుతున్నాయి. బీజేపీ గణనీకంగా పంజుకుందనే లెక్కలతో పోలింగ్ సరళి ఒక విధంగా సర్వే సంస్థలకు అంతు చిక్కటం లేదు. దీంతో..ఈ నెల 3న జరిగే కౌంటింగ్ పైన ఉత్కంఠ పెరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+