Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మిస్ వరల్డ్ పోటీలను చూడాలనుకుంటున్నారా.. ఫ్రీ పాస్ కోసం ఏం చేయాలంటే ?

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీ మిస్ వరల్డ్ 2025 ఎడిషన్‌కు హైదరాబాద్‌ నగరం వేదికగా మారుతోంది. మే 7 నుంచి మే 31 వరకు మొత్తం 28 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ అంతర్జాతీయ బ్యూటీ ఫెస్టివల్ అట్టహాసంగా జరగనుంది. ప్రారంభ కార్యక్రమం, ముగింపు వేడుకలు, గ్రాండ్ ఫినాలే అన్నీ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే 100కి పైగా దేశాల నుంచి పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకోవడంతో నగరం అంతా ప్రపంచ సుందరీమణులతో కళకళలాడుతోంది.

ఉచిత పాసులు..

ఇక ఈ అంతర్జాతీయ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే పౌరుల కోసం తెలంగాణ పర్యాటక శాఖ ఉచిత కాంప్లిమెంటరీ పాస్‌లు అందిస్తోంది. వీటిని పొందాలంటే www.tourism.telangana.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలి. ఎంపికైన వారికి పాస్‌లు మెయిల్ ద్వారా అందజేస్తారు. ఇది ప్రపంచ సుందరీమణులను ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం అని.. ఆసక్తి ఉన్న వారు వినియోగించుకోవాలని కోరుతున్నారు.

chance-for-free-pass-to-watch-the-miss-world-2025-competitions-in-hyderabad

మిస్ వరల్డ్ పోటీల 71 ఏళ్ల చరిత్రలో భారత్ ఇప్పటివరకు రెండు సార్లు ఆతిథ్యం ఇచ్చింది. 1996లో బెంగళూరులో, 2023లో ముంబైలో ఈ పోటీలు నిర్వహించగా.. ఇప్పుడు మూడోసారి 2025లో హైదరాబాద్ వేదిక అవుతోంది. మిస్ వరల్డ్ పోటీ కేవలం అందానికి సంబంధించినదే కాక.. 'బ్యూటీ విత్ పర్పస్' అనే ధ్యేయంతో మానవతా విలువలు, సేవా భావన, సామాజిక బాధ్యతల్ని ప్రోత్సహిస్తుంది. మహిళా శక్తి, సామాజిక బాధ్యత కలిగిన నాయకత్వానికి ఇది వేదిక అవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు పోటీదారులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో సైతం భాగస్వాములు కానున్నారు.

ఇక ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం తీసుకోవాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పట్టణ అభివృద్ధి సహా పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులు, మంత్రులతో సమగ్రంగా చర్చ జరిపారు. ఈ పోటీల కోసం విదేశాల నుంచి వచ్చే కంటస్టెంట్స్, గ్లోబల్ అతిథులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేయాలని సీఎం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి హోటళ్ల వరకూ ప్రత్యేక వీఐపీ వాహనాలు, వెల్కమ్ టీంలను ఏర్పాటు చేయాలని, గెస్ట్‌లు గమ్యం చేరే సమయానికి ప్రతి విషయాన్ని ప్రొఫెషనల్‌గా నిర్వహించాలని సూచించారు.

అంతే కాకుండా పోటీలలో పాల్గొనేవారికి తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసే విధంగా హోటళ్లలో 'వెల్కమ్ కిట్స్', స్పెషల్ మెనూలు, పర్సనలైజ్డ్ హాస్పిటాలిటీని అందించాలన్నారు. మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు హోటళ్ల వద్ద ప్రత్యేక భద్రతా బలగాలు, మహిళా పోలీస్‌లు అందుబాటులో ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ప్రణాళికలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు.

అంతర్జాతీయ మీడియా కవరేజ్ ను సైతం దృష్టిలో ఉంచుకుని స్పెషల్ ప్రెస్ ఏరియాలు, హైస్పీడ్ ఇంటర్నెట్ హబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అతిథులకు భాషా సమస్యలు తలెత్తకుండా ట్రాన్స్‌లేటర్స్, ఇంటర్‌ప్రెటర్స్‌ను నియమించాలన్నారు. ఈవెంట్‌ను సోషల్ మీడియా ద్వారా గ్లోబల్ ప్రమోట్ చేయాలని కమ్యూనికేషన్స్ శాఖకు టాస్క్ అప్పగించారు. మరోవైపు తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+