'కెసిఆర్, బాబు మధ్య ఫిక్సింగ్: నమస్తే తెలంగాణలో హెరిటేజ్ యాడ్'
రివర్స్: మా పోలీస్‌ను పంపించాలని ఏపీ, అందర్నీ కుదరదని తెలంగా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముమ్మాటికీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, అందుకు నిదర్శనం ఉందని చెప్పారు. కెసిఆర్ కుటుంబ పత్రిక అయిన నమస్తే తెలంగాణలో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ యాడ్ వచ్చిందని ఆయన చెప్పారు. మరే ఇతర పత్రికలో కూడా ఇంతవరకు హెరిటేజ్ సంస్థ యాడ్ ఇవ్వలేదన్నారు.

దీనిని బట్టే ముఖ్యమంత్రులు మధ్య ఉన్న సంబంధాలు అర్థమవుతున్నాయన్నారు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించడం సరికాదని షబ్బీర్ అలీ అంతకుముందు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితను కేంద్రమంత్రిగా చేసే ప్రణాళికలో భాగంగా మహారాష్ట్ర సర్కారుకు సహకరించి తద్వారా బీజేపీతో సాన్నిహిత్యం నెరపేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాలని చూస్తే తాము ఉద్యమిస్తామన్నారు.












Click it and Unblock the Notifications