రేవంత్ కంటే చంద్రబాబు చాలా బెటర్!: మందకృష్ణ ఇలా ఎందుకన్నారు?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. వికలాంగుల (దివ్యాంగుల) సమస్యలపై ఆయన మాట్లాడారు. చేయూత పింఛన్‌దారులుందరినీ వికలాంగుల పోరాట సమితి ఏకీకృతం చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు.
చేయూత పింఛన్ తీసుకునే వారిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నట్టేట ముంచిందని మందకృష్ణ మాదిగ విమర్శించారు. వీరితో కలిసి బలమైన ఉద్యమం చేపడతామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నమ్మిన పింఛన్‌దారులు కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. 10 నెలలు అయినా.. ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని ఆయన రేవంత్ సర్కారును నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చామని తెలిపిన మందకృష్ణ మాదిగ... దివ్యాంగులకు రూ. 6 వేలు పింఛన్ ఇవ్వాలని కోరామన్నారు. చంద్రబాబు జూన్‌లో అధికారంలోకి రాగానే ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలవి ఇచ్చారని తెలిపారు. ఏపీలో కండరాల క్షీణత ఉన్నవాళ్లకు రూ. 15 వేల పింఛన్లు ఇస్తున్నట్లు చప్పారు.
రేవంత్ కంటే చంద్రబాబు చాలా నయమని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చే నెల మొదటి వారంలో గడిచిన 10 నెలల బకాయిలతోపాటు నవంబర్ పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. నవంబర్ 1 నుంచి 16 వరకు ప్రతిరోజూ రెండు జిల్లాల్లో చేయూత పింఛన్ లబ్ధిదారులకు చైతన్య సభల నిర్వహస్తామని మందకృష్ణ తెలిపారు.
అయినా రేవంత్ ప్రభుత్వం దిగిరాకపోతే నవంబర్ 26న చలో హైదరాబాద్ కు పిలుపునిస్తామని మందకృష్ణ మాదిగ తెలిపారు. వికలాంగుల మహా గర్జన పేరిట వేలాది మందితో ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపడతామన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెసేతర అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామని తెలిపారు. ఇక, రేవంత్ సర్కారుతో తాడో పేడో తేల్చుకోవడమేనని మందకృష్ణ స్పష్టం చేశారు.
-
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications